Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"బ్లూ డ్రమ్‌లో నింపేస్తా" అని బెదిరించిన భార్య.. భయపడి భర్త ఆత్మహత్య

"బ్లూ డ్రమ్‌లో నింపేస్తా" అని బెదిరించిన భార్య.. భయపడి భర్త ఆత్మహత్య

వార్త 3 weeks ago

Uttar Pradesh crime: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు, మనస్పర్థలు సహజమే. కానీ అవే హద్దులు దాటి మానసిక వేదనగా మారితే జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో అలాంటి విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. దాంపత్య కలహాలు, భార్య నుంచి ఎదురైన మానసిక ఒత్తిడిని తట్టుకోలేక 27 ఏళ్ల వినయ్ యాదవ్ అనే యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, భార్య రంజనా తరచూ ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతూ తీవ్ర మానసిక వేదనకు గురి చేసేదని తెలిపారు. అంతేకాకుండా, “నిన్ను బ్లూ డ్రమ్‌లో నింపేస్తా” అంటూ భయపెట్టేదని ఆరోపించారు.

Read Also : BRS Ex MLA Rega Kantha Rao: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదు

 Husband takes his own life, fearing wife’s threats.

Uttar Pradesh crime: మానసిక ఒత్తిడి తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్య

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భార్య పెడుతున్న వరుస బెదిరింపులు, భయాందోళనల వల్ల వినయ్ గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఆమె పెడుతున్న నరకాన్ని భరించలేక జులై 31న తమ ఇంటి లో ఉరివేసుకుని వినయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయమే గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ దారుణ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భార్య బెదిరింపుల కోణంలో, దాంపత్య వివాదాలపై లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.

మోదీ ఏఐ మార్ఫింగ్ వీడియోల వ్యవహారం..మెటా ఇండియా హెడ్‌పై కేసు నమోదు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha