Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బొబ్బిలిలో ఘనంగా కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ

బొబ్బిలిలో ఘనంగా కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ

వార్త 1 week ago

Bobbili news:కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి రెండేళ్ల విజయోత్సవ సభను బొబ్బిలి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో గౌరవ శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయనగరం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వేమకోటి గిరిబాబు గారు, బీజేపీ నాయకులు పెంట స్వామినాయుడు గారు, బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు. బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇంకే రాష్ట్రానికి జరగలేదని, వైసీపీ వాళ్ళు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే బురద జల్లడమే పనిగా పెట్టుకుని రెండేళ్లుగా అదే పనిలో వైసీపీ వారు ఉన్నారని అన్నారు.. గౌరవ ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, మనమందరం వారికి సహకరిస్తే ఇంకా అభివృద్ధి చెయ్యగలరని తెలిపారు.. ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలిచారని వారిని ప్రశంసించారు.

Read also: Nellore News:అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి:జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

 Alliance's Two-Year Victory Celebration Meeting in Bobbili

ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుండి అభివృద్ధి, సంక్షేమ దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి వంటి పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతోందని వివరించారు..సంక్షేమం - అభివృద్ధి రెండు కళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాల్లో వేగంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.. 2019-24 మధ్య ఆర్ధిక ఉగ్రవాదం జరిగిందని, వాటిని అధిగమించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నడుపుతున్నారని అన్నారు.. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నేపథ్యంలో ఎంతో భయపడ్డామని, ముఖ్యమంత్రి గారి అనుభవంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని అన్నారు.. కేంద్రం తరుపున ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పెద్దన్న పాత్ర పోషిస్తూ ఏపీ కి సహకారం అందిస్తున్నారని..ఎన్డీఏ కూటమిపై ప్రజలు ఉంచిన నమ్మకం నిలబెట్టు కుంటూ పనిచేస్తున్నామని చెప్పారు.. చంద్రబాబు గారుని వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసి, టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిస్వార్థంగా ముందుకొచ్చి నిలబడిన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనమంతా రుణపడి ఉన్నామని, వారి సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు..డిప్యూటీ సీఎం మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు.. ఎంతమంది విమర్శించినా రాష్ట్ర అభివృద్ధికి కే కట్టుబడి ముందుకు వెళ్తున్నారన్నారు.. అలాగే, గౌరవ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, లోకేష్ గారితోనే మా ప్రయాణం అని అన్నారు..

Bobbili news:నియోజకవర్గ ప్రగతిపై ప్రత్యేక దృష్టి

మాట ఇచ్చిన విధంగా 16000 డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత లోకేష్ గారుది అని కొనియాడారు..ఎలాంటి అవినీతికి తావు ఇవ్వకుండా శ్రీ లోకేష్ గారు పనిచేస్తున్నారని, ఇంతటి పోటీ ప్రపంచంలో మన రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారని అన్నారు..రాష్ట్ర ప్రజల నమ్మకం నిలబెట్టుకుంటూ పనిచేస్తామని, బొబ్బిలి రాజకీయ చరిత్రలో 44,000 మెజారిటీ ఇచ్చిన ప్రజలకు నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ప్రజల దయతో వచ్చిన పదవిని భారంగా భావించకుండా, గత 5 ఏళ్లుగా ఉండిపోయిన సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.. త్వరలోనే పారాది వంతెన పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని అన్నారు..బొబ్బిలి రోడ్లు అభివృద్ధి చేశామని, ఒక్కొక్క సమస్య పరిష్కారం చేస్తున్నామని చెప్పారు..మన నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీ ద్వారా తీసుకెళ్ళానని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారుని, ఎందరో మంత్రులను కలిసి మన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి సహకరించమని కోరానని తెలిపారు.. పంట కాలువలలో పూడికలను నా సొంత నిధులతో తీయించి, సాగునీటి ఇబ్బందులు లేకుండా చేశానని..పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు సువర్ణముఖి నది నుంచి 123.9 కోట్లతో ప్రాజెక్టు మొదలుపెట్టామని చెప్పారు..గత ప్రభుత్వం హయాంలో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు భయపడేవారని, కానీ ఇప్పుడు బొబ్బిలి పట్టణంలో అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్లు ముందు వచ్చి పనిచేస్తున్నారని అన్నారు..గొల్లాడి బ్రిడ్జి పనులు కూడా త్బరలోనే ప్రారంభం కానుందని, లోచర్ల - రాముడువలస ఎత్తిపోతల పథకం కూడా త్వరలోనే ప్రారంభం కానుందని, వైసీపీ వారి హయాములో అన్ని అనుమతులు వచ్చినా కూడా ప్రారంభానికి నోచుకోలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అవి మళ్లీ మొదలు పెడతామని అన్నారు..నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని, అధికారులు కూడా మనకి సహకరిస్తున్నారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను నాయకులు వివరించారు..

 Alliance's Two-Year Victory Celebration Meeting in Bobbili

బొబ్బిలి నియోజకవర్గానికి ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్ధి వివరాలు

  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుపథకం క్రింద 43664 మంది లబ్ధిదారులకు ₹43178.60 లక్షలు అందించబడినవి.
  • అన్నదాత సుఖీభవ పథకం క్రింద 35054 మంది లబ్ధిదారులకు ₹6823.38 లక్షలు అందించబడినవి.
  • తల్లికి వందనం పథకం క్రింద 30485 మంది లబ్ధిదారులకు ₹4572.75 లక్షలు అందించబడినవి.
  • ఉచిత వంట గ్యాస్ (ఇంటికి సం.కి మూడు సిలెండర్లు) పధకం క్రింద 83671 మంది లబ్దిదారులకు 30.79కోట్లు రూపాయలు లబ్దిని చేకూర్చడమైనది.
  • పీఎంఏవై (అర్బన్, గ్రామీణ్&పీఎం జన్మన్)హౌసింగ్ పథకం క్రింద 1,532 మంది లబ్ధిదారులకు ₹646.65 లక్షలు అందించబడినవి.
  • విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు క్రింద మొత్తం 8484 మంది SC, ST, BC, EBC విద్యార్ధులకు ₹2085.48 లక్షలు అందించబడినవి.
  • జాబ్ మేళా నిర్వహించి 1141మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమైనది.
  • పీఎం పోషణ్ (మధ్యాహ్న భోజన పథకం)క్రింద 15049మంది లబ్ధిదారులకు ₹1,040.26 లక్షలు అందించబడినవి.
  • ICDS శాఖ ద్వారా పిల్లలకు, గర్భినిలకు, బాలింతలకు అనుబంధ పోషకాహార కార్యక్రమంక్రింద 8047మంది లబ్ధిదారులకు ₹122.72 లక్షలు ఖర్చు చేయడమైనది.
  • ఎన్టీఆర్ వైద్య పథకం క్రింద 34925 మంది లబ్ధిదారులకు ₹61.83 లక్షలు అందించబడినవి.
  • వైద్య ఆరోగ్ర శాఖ ద్వారా జేఎస్ఎస్‌కే పధకం క్రింద 2449మంది లబ్ధిదారులకు ₹7.34 లక్షలు, కుటుంబ నియంత్రణ కార్యక్రమం క్రింద 904 మంది లబ్ధిదారులకు ₹6.59 లక్షలు అందించబడినవి.
  • DRDA ద్వారా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు క్రింద 32700 మంది లబ్ధిదారులకు ₹282.23 లక్షలు, స్త్రీనిధి పధకం క్రింద 6196 మంది లబ్ధిదారులకు ₹5893.02 లక్షలు, ఉన్నతిపధకం క్రింద 329 మంది లబ్ధిదారులకు ₹217.90 లక్షలు, సీఐఎఫ్పధకం క్రింద 140 మంది లబ్ధిదారులకు ₹127.30 లక్షలు, పీఎంఎఫ్‌ఎంఈ పథకం క్రింద 26 మంది లబ్ధిదారులకు ₹112.37 లక్షలు, పీఎంఈజీపీ పథకం క్రింద 52 మంది లబ్ధిదారులకు ₹135.88 లక్షలు, సీడ్ క్యాపిటల్ పథకం క్రింద 26 మంది లబ్ధిదారులకు ₹10.40 లక్షలు, ఎగ్ కార్ట్స్ పథకం క్రింద 4 మంది లబ్ధిదారులకు ₹2.00 లక్షలు అందించబడినవి.
  • పశుసంవర్ధక శాఖ ద్వారా పశుసంపద, గొర్రెలు, మేకలు, కోళ్ళు అభివృద్ధి కొరకు రూ. 136.27 లక్షలతో పశువుల మేత, పశుగ్రాస విత్తనాల రైతులకు పంపిణీ మరియు పశు ఆరోగ్య శిబిరాలు, డీ-వార్మింగ్, టీకాలు మొదలగు కార్యక్రమాలు చేపట్టటం జరిగినది.
  • పశు బీమా నమోదు క్రింద 597 మంది లబ్ధిదారులకు ₹9.34లక్షలు ఖర్చుచేయడమైనది. పశు బీమా పథకం క్రింద 43మంది లబ్ధిదారులకు ₹13.60 లక్షలు అందించబడినవి.
  • పశు కిసాన్ క్రెడిట్ కార్డులు (పీకేసీసీ)ద్వారా 543మంది లబ్ధిదారులకు ₹362.79 లక్షలు అందించబడినవి.
  • పాస్టర్ల గౌరవ వేతనం క్రింద 5మంది లబ్ధిదారులకు ₹5.00 లక్షలు, ఇమాములు మరియు మౌజన్ల గౌరవ వేతనం క్రింద 2 మంది లబ్ధిదారులకు ₹2.40 లక్షలు అందించబడినవి.
  • న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ (ఉల్లాస్ అక్షర ఆంధ్ర 2025-26) క్రింద 34700 మంది లబ్ధిదారులకు ₹59.55 లక్షలు ఖర్చుచేయడమైనది.
  • సిల్క్సమగ్ర పథకం క్రింద సెరికల్చర్ రైతులకు ₹ 6.27 లక్షలు అందించబడినవి.
  • చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం క్రింద 166 మంది చేనేతకార్మికులకు లబ్ధిచేకూర్చడమైనది.
  • ముద్ర పథకం క్రింద 47మంది చేనేత కార్మికులకు రూ.56.75 లక్షలు అందించడమైనది మరియు పొదుపు నిధి పథకం క్రింద 24 మంది లందిదారులకు 64 వేలు రూపాయలు అందించడమైనది.
  • ఉద్యాన పంటల అభివృద్ధి పథకాలు క్రింద 1204 మంది రైతులకు ₹182.20 లక్షలు అందించబడినవి.
  • నియోజకవర్గం మొత్తం మీద వివిధ సంక్షేమ పధకాలు క్రింద 8,87,186 మంది లబ్దిదారులకు(ఒక్కో కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పధకాలు క్రింద లబ్దిపొందబడి) ₹ 693.64 కోట్లు రూపాయలు గత రెండు సంవత్సరాలలో లబ్ది చేకూర్చడం జరిగినది.
  • వీటితోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం తనదైన ప్రగతిని సాధించింది. నియోజకవర్గం మొత్తం మీద నేటివరకు 1219 అభివృద్ధి పనులు చేపట్టి ₹126.59 కోట్లు రూపాయలు మంజూరి చేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయోత్సవ సభను విజయవంతం చేశారు.

Epaper: epaper.vaartha.com

నెల్లూరు కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో మంత్రి నారాయణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha