Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజస్థాన్ రాయల్స్ ఓటమికి కారణం అదే: కెప్టెన్ రియాన్ పరాగ్

రాజస్థాన్ రాయల్స్ ఓటమికి కారణం అదే: కెప్టెన్ రియాన్ పరాగ్

వార్త 2 months ago

SRH vs RR: ఐపీఎల్ 2026 సీజన్‌లో శనివారం రాత్రి జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరోసారి తమ బ్యాటింగ్ పవర్‌ను నిరూపించుకుంది. పరుగుల పండగగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

229 పరుగుల హిమాలయమంత లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Read Also:IPL 2026 : నిన్న ఒక్కరోజే 986 రన్స్..టోర్నీ చరిత్రలో రికార్డు

ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ల మెరుపు దాడి..

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు భారీ స్కోర్ చేసింది.వైభవ్ సూర్యవంశీ (37 బంతుల్లో 103 రన్స్) సూపర్ బ్యాటింగ్‌తో 228/6 పరుగులు చేసింది. కానీ బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో తేలిపోయి.. పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో మూడో ప్లేసుకు దూసుకొచ్చింది. ఇప్పటి వరకూ ఆడిన 8 మ్యాచులలో ఆ జట్టు ఐదింట్లో విజయం సాధించింది. తొలి రెండో స్థానాల్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమితో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది.

 Riyan Parag Comments IPL 2026

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రియాన్ పరాగ్.. చెత్త ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువగా చేయడం తమ ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు. ‘నైపుణ్యం పరంగా మేం బాగానే రాణించాం. మా ప్రణాళికలను బాగానే అమలు చేశాం. కానీ చాలా క్యాచ్‌లు వదిలేశాం. అభిషేక్ శర్మ వంటి డేంజరస్ ప్లేయర్లకు క్యాచ్‌లు వదిలేసి అవకాశం ఇస్తే ఏ మాత్రం వదిలిపెట్టరు.మేము బ్యాటింగ్‌లో మరో 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసి ఉండాల్సింది.

SRH vs RR: ఓటమిపై రియాన్ పరాగ్ ఆవేదన

కానీ, సన్‌రైజర్స్ బౌలర్లు చివరి రెండు ఓవర్లలో పరుగులు రాకుండా కట్టడి చేశారు. అద్భుతమైన యార్కర్లతో పరుగులు రాబట్టేందుకు అవకాశం ఇవ్వలేదు. మేము మరో 15 పరుగులు అదనంగా చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.క్లాసెన్ వచ్చాక బిష్ణోయ్, జడేజాతో బౌలింగ్ చేయించాలనుకున్నా. కానీ, వికెట్ స్పిన్‌కు ఏమాత్రం సహకరించలేదు. అందుకే ఎలాగోలా నాలుగు ఓవర్లు మేనేజ్ చేయాల్సి వచ్చింది. స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తే బాగుండేది.

కానీ ఈ వికెట్‌పై పేసర్లే వికెట్లు తీయాలి. స్పిన్నర్లు కేవలం రన్‌రేట్‌ను నియంత్రించాలి. అనుకున్న ప్లాన్ సరిగ్గా సాగలేదని రియాన్ అన్నారు.ఏదిఏమైనా మేము మెరుగ్గా ఫీల్డింగ్ చేసి ఉండాల్సింది. మా ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీ ఎలా స్పందిస్తారో చూడాలి. మా పట్ల కఠినంగా వ్యవహరించరని ఆశిస్తున్నా. కానీ, ఆటలో ఫీల్డింగ్ చాలా కీలకం. తర్వాతి మ్యాచ్‌లో ఈ తప్పిదాలను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మాకు ఒకరోజు విరామం ఉంది. మానసికంగా రిప్రెష్ అయ్యి తరువాతి మ్యాచ్‌కు సిద్ధమవుతాం అని రియాన్ పరాగ్ చెప్పాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నేడు డబుల్ డోస్..ఆ జట్లకు కీలకం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha