MP Rupert Lowe: యూకే రాజకీయాల్లో వలసదారుల అంశం మరోసారి తీవ్ర దుమారానికి దారితీసింది. బ్రిటీష్ పార్లమెంట్ సభ్యుడు రూపర్ట్ లోవ్.. బ్రిటన్‌లోని భారతీయ, పాకిస్థానీ వలసదారులు స్థానికుల ఉద్యోగాలను దొంగిలిస్తున్నారంటూ జాత్యహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు.
వలసదారులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగంతో బాధపడుతున్న బ్రిటిష్ పౌరుల ఉద్యోగాలను లాక్కోవడానికే భారతీయులు, పాకిస్థానీయులను ‘దిగుమతి’ చేసుకుంటున్నారంటూ ఆయన చేసిన పోస్ట్ తీవ్ర వివాదాస్పదమైంది.
Read Also: Iran US Deal : ఇరాన్ క్లారిటీ.. అమెరికాతో డీల్ ఇంకా ఫైనల్ కాలేదా?
MP Rupert Lowe
“నన్ను జాత్యహంకారి అని పిలిచినా పర్వాలేదు”.. ఎక్స్‌లో రూపర్ట్ లోవ్ పోస్ట్
“నిరుద్యోగ బ్రిటన్ ప్రజలు చేయాల్సిన ఉద్యోగాల కోసం లక్షలాది మంది పాకిస్థానీయులను, భారతీయులను దిగుమతి చేసుకోవాలని నేను నమ్మను. నన్ను జాత్యహంకారి అని పిలిచినా పర్వాలేదు.. నేను నిజాలే మాట్లాడతాను” అని రూపర్ట్ లోవ్ గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన పోస్ట్ చేశారు. అంతకుముందు కూడా ఆయన వలస వచ్చిన వారిని టార్గెట్ చేస్తూ.. “ఇంగ్లండ్‌లో నివసించే విదేశీ పౌరులు ఇంగ్లీష్ మాట్లాడాలని, దేశం నుండి తీసుకునేదాని కంటే దేశానికి ఎక్కువ ఇవ్వాలని ఆశించడం జాత్యహంకారం కాదు” అని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో కొన్ని పోస్టులను రీపోస్ట్ చేయడంతో వీటికి మరింత ప్రచారం లభించింది.
MP Rupert Lowe: ముస్లిం, సిక్కు వర్గాలే లక్ష్యంగా సంచలన ప్రకటనలు
రూపర్ట్ లోవ్ తన విద్వేషపూరిత అజెండాను మరింత ముందుకు తీసుకెళ్తూ.. ముస్లిం, సిక్కు వర్గాలను లక్ష్యంగా చేసుకుని సంచలన ప్రకటనలు చేశారు. తాము అధికారంలోకి వస్తే బ్రిటన్‌లో అనేక సాంప్రదాయ, మతపరమైన పద్ధతులను నిషేధిస్తామని ప్రకటించారు.
- బురఖా, షరియా కోర్టులను పూర్తిగా నిషేధిస్తాం.
- కజిన్ మ్యారేజెస్ (మేనరికం), హలాల్ మాంసాన్ని బ్యాన్ చేస్తాం.
- ‘రీస్టోర్ బ్రిటన్’ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బహిరంగ ప్రదేశాల్లో సిక్కులు ధరించే ఖడ్గం (కిర్పాన్) వాడకాన్ని కూడా నిషేధిస్తాం. అందరికీ ఒకే నియమం ఉండాలి.
- మాంచెస్టర్‌లోని కొన్ని ప్రాంతాలు ఇస్లామిక్ కాలనీలుగా మారుతున్నాయని, ఇది ఒకరకమైన వలసీకరణ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘రిఫార్మ్ యూకే’ నుండి సస్పెన్షన్.. ‘రీస్టోర్ బ్రిటన్’ స్థాపన
నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని ‘రిఫార్మ్ యూకే’ పార్టీ తరఫున గ్రేట్ యార్‌మౌత్ నుంచి ఎంపీగా ఎన్నికైన రూపర్ట్ లోవ్, అంతర్గత విభేదాల కారణంగా గతేడాది సస్పెన్షన్‌కు గురయ్యారు. అనంతరం ఆయన ‘రీస్టోర్ బ్రిటన్’ పేరుతో సొంతంగా ఓ ఫార్-రైట్ (తీవ్ర కుడి పక్ష) పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఈ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జూన్ 18న జరగనున్న మేకర్‌ఫీల్డ్ ఉప ఎన్నిక బ్రిటన్ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి హౌస్ ఆఫ్ కామన్స్‌లో అడుగుపెట్టాలని లేబర్ పార్టీకి చెందిన గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్‌హామ్ ప్రయత్నిస్తున్నారు. వచ్చే నెలలో కీలక ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, రూపర్ట్ లోవ్ చేస్తున్న ఆన్‌లైన్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
జూన్‌లో బ్యాంకులకు 11 రోజులు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి!

