Iran US Deal : అమెరికాతో ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి ఇంకా కొనసాగుతోందని, చర్చలు పూర్తికాలేదని వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒప్పందానికి సంబంధించిన కొన్ని షరతులను ప్రకటించిన నేపథ్యంలో బఘాయీ ఈ వ్యాఖ్యలు చేశారు.
యుద్ధం ముగించడంపైనే ఇరాన్ దృష్టి
ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రధాన లక్ష్యం యుద్ధానికి ముగింపు పలకడమేనని బఘాయీ తెలిపారు. యురేనియం శుద్ధి లేదా నిల్వల అంశాలపై ఈ దశలో ఎలాంటి వివరమైన చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలు ప్రస్తుతం చర్చల కేంద్రబిందువుగా లేవని ఆయన పేర్కొన్నారు.
హార్ముజ్ జలసంధిపై కీలక వ్యాఖ్యలు
హార్ముజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడంపై స్పందించిన బఘాయీ, భవిష్యత్తులో ఆ జలమార్గం నిర్వహణ పూర్తిగా ఇరాన్, ఒమన్ దేశాలకు సంబంధించిన విషయమని అన్నారు. మరోవైపు ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు తయారు చేయబోమని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హార్ముజ్ జలసంధిని ఎలాంటి టోల్ లేకుండా వెంటనే తెరవాలని, సముద్ర మార్గంలో ఉన్న మైన్లను తొలగించాలని కోరారు.
Read Also : Vanaparthi Crime: అప్పుల బాధతో భార్యాపిల్లలను చంపి.. ఆ పై తాను ఉరేసుకొని ఆత్మహత్య
Iran US Dealఅలాగే అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణు శక్తి సంస్థ సహకారంతో గుర్తించి నాశనం చేస్తామని పేర్కొన్నారు. యుద్ధ నష్టపరిహారం అంశంపై మాత్రం ప్రస్తుతం ఎలాంటి ఆర్థిక చెల్లింపులు ఉండవని స్పష్టం చేశారు.
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య 40 రోజుల ఘర్షణల అనంతరం ఏప్రిల్ 8న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో పలు ప్రతిపాదనలు ఇరు దేశాల మధ్య మార్పిడి అయినట్లు సమాచారం. ప్రస్తుతం పరస్పర అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా చర్చలు కొనసాగుతున్నట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

