Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్‌లో బ్యాంకులకు 11 రోజులు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి!

జూన్‌లో బ్యాంకులకు 11 రోజులు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి!

వార్త 2 weeks ago

Bank Holidays June : కొత్త నెల జూన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

గత కొన్ని నెలలతో పోలిస్తే జూన్ 2026లో బ్యాంక్ సెలవులు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ప్రాంతీయ పండుగలు మరియు వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో కొన్ని సెలవులు ప్రత్యేక రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాగా, కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.

రాష్ట్రాల వారీగా ప్రత్యేక సెలవులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రతి నెల రెండో, నాల్గవ శనివారాలు మరియు అన్ని ఆదివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. జూన్ 15న వైఎంఏ డే, రాజా సంక్రాంతి సందర్భంగా మిజోరం, ఒడిశా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జూన్ 25న మొహర్రం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. జూన్ 26న మొహర్రం, అషూరా కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అలాగే జూన్ 29న సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో, జూన్ 30న రెమ్నా ని పీస్ డే సందర్భంగా మిజోరంలో బ్యాంకులు మూసి ఉంటాయి.

Read Also : Karnataka politics: కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!

 Bank Holidays June

ఆన్‌లైన్ సేవలు యథావిధిగా

బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ ఖాతాదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను ఎప్పటిలాగే వినియోగించుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అయితే చెక్కుల క్లియరెన్స్, పాస్‌బుక్ అప్‌డేట్, నగదు డిపాజిట్, రుణ సంబంధిత సేవలు వంటి శాఖల ఆధారిత కార్యకలాపాలు సెలవు రోజుల్లో అందుబాటులో ఉండవు. అందువల్ల ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha