Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BRS ప్రస్థానం ముగిసింది..

BRS ప్రస్థానం ముగిసింది..

వార్త 1 month ago
  • వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా ప్రచారంలో బిజీ
  • కెసిఆర్ కేవలం అధికారం కోసమే బయటకు..
  • ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Yennam Srinivas Reddy: హైదరాబాద్ లోని సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పత్రికా సమావేశంలో మాట్లాడారు.

బీఆర్ఎస్ రాజకీయ పార్టీకి 25 సంవత్సరాల ప్రస్థానం పూర్తైందని, వాడవాడల సంబరాలు జరుపుకోవాల్సింది పోయి, కేవలం పార్టీ కార్యాలయంలో తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహించారని పేర్కొన్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారని, 25ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యంగా మారిందన్నారు. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేదన్నారు.

Read Also:Sangareddy: రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ వ్యవసాయ క్షేత్రంలో చోరీ

Yennam Srinivas Reddy: బీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు

కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి వ్యవస్థ నిర్వీర్యమైందని మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. ధరణి పోర్టల్ వల్ల లక్షలాది రైతులు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. వీఆర్వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, పోలీసులను పార్టీ కార్యకర్తలలా ఉపయోగించి ప్రజలపై నిఘా పెట్టించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు సమయానికి జీతాలు పడలేదని, కాలేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లక్షల కోట్ల ప్రజాధనం వృథా చేశారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను మా ప్రభుత్వం తక్కువ సమయంలో పరిష్కరించిందని,గతంలో 57 రోజుల సమ్మె, 30 మంది కార్మికుల ప్రాణ నష్టం జరిగిందన్నారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మళ్లీ గాడిలో పెట్టామన్నారు.మీ పాలనలో రుణమాఫీ విడతల వారీగా ఇచ్చారని, మా ప్రభుత్వం 2½ సంవత్సరాల్లోనే 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసింది. రైతు భరోసా, బోనస్ అందించామని, అన్ని వర్గాల సంక్షేమం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.కేసీఆర్ అధికారం కోసం మాత్రమే బయటకు వస్తారని, ప్రజల కోసం రావడం లేదని విమర్శించారు. బీజేపీ - బీఆర్ఎస్ కూటమి రూపుదిద్దుకుంటోందని, కాలేశ్వరం అంశంపై కేంద్రం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఒకవైపు బీజేపీ - బీఆర్ఎస్ కూటమి ఉందని, మరోవైపు ప్రజల పక్షాన నిలబడే కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గుమ్మడిదలలో అగ్నిప్రమాదం - బ్యాటరీ పేలుడుతో కార్లు, బైక్ దగ్ధం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha