Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ వ్యవసాయ క్షేత్రంలో చోరీ

రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ వ్యవసాయ క్షేత్రంలో చోరీ

వార్త 1 month ago

Sangareddy: గారికి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామానికి చెందిన రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ వి.నాగిరెడ్డి, వ్యవసాయ క్షేత్రంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

చౌటకూర్ మండలం శివంపేట గ్రామ శివారులో గల వ్యవసాయ క్షేత్రంలో ఆయ గెస్ట్ హౌస్స్ను నిర్మించుకున్నారు. ఈ భవనంపైన నిర్మించిన పెంట్ హౌస్తో పాటు మె దటి అంతస్తులో బెడ్ రూంకు ఏసీలను అమర్చారు. గుర్తు తెలియని వ్యక్తులు గెస్ట్ హౌస్ తలుపుల తాళాను ధ్వం సం చేసి పెంట్ హౌస్లోలోకి చొరబడి ఏసీ కూలర్, కంప్రెషన్ను ఎత్తుకెళ్లారు. దీంతో పాటు బీరువాలో ఉంచిన ప్రొజెక్టర్ను దొంగలు ఎత్తుకెళ్లారు.

Read Also:CV Anand appointed as Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Sangareddy: పోలీసుల దర్యాప్తు

కిచెన్ గదిలో బిగించిన నల్లాలు ఇతరాత్ర సామాగ్రిని ఎత్తుకుపోయారు. సం ఘటన విషయం తెలుసుకున్న ఆయన సోదరుడు పెద్దారెడ్డిపేట గ్రామ మాజీ సర్పంచ్ వి.యాదగిరిరెడ్డి గెస్ట్ హౌస్ కు చేరుకుని ఏసీ దొంగిలించిన తీరును పరిశీలించారు. ఈ విషయమై పుల్కల్ ఎస్ఐ నల్లా విశ్వజన్కు సమాచారం అందించగా, పోలీసు సిబ్బందిని పంపించి పంచనామా చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత నేరస్తులెవరైనా ఈ చోరీకి పాల్పడి ఉంటారన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

'సీవీ ఆనంద్'.. ఏ శాఖలోనైనా తిరుగులేని ముద్ర సొంతం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha