Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BRSపై పవన్ సానుకూల స్పందన ..ఎందుకో ?

BRSపై పవన్ సానుకూల స్పందన ..ఎందుకో ?

వార్త 2 months ago

Pawan Kalyan on BRS : ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ (BRS) పార్టీపై సానుకూల వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

2014 నుండి 2023 వరకు సాగిన బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణలో తన పర్యటనలకు గానీ, రాజకీయ కార్యక్రమాలకు గానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సాకుతో ఆయన ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేశారు. గత 13 నెలలుగా కాంగ్రెస్ నేతలు తనను టార్గెట్ చేస్తూ, హైదరాబాద్‌కు రావద్దంటూ ఆంక్షలు విధిస్తున్నారని, తన సంచార స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని పవన్ ఆరోపించారు. ప్రస్తుత అధికార పక్షంపై ఉన్న రాజకీయ వ్యతిరేకత వల్లే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా బీఆర్‌ఎస్ వైఖరిని ప్రశంసిస్తూ కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : సంగారెడ్డిలో 'ఆరైవ్ అలైవ్' గర్జన!

'పొలిటికల్ టూరిస్ట్, దత్తపుత్రుడు'.. పాత గాయాలను మర్చిపోయిన జనసేనాని!

అయితే, బీఆర్‌ఎస్‌పై పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నప్పటికీ, గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరుపక్షాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది. పవన్ కళ్యాణ్‌ను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే ‘పొలిటికల్ టూరిస్ట్’ అని, చంద్రబాబు నాయుడి ‘దత్తపుత్రుడు’ అని బీఆర్‌ఎస్ అగ్రనేతలు, మంత్రులు అప్పట్లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన సైనికులు, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య అప్పట్లో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున యుద్ధమే నడిచింది. అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ పాత విమర్శలను పక్కనపెట్టి, తన ప్రస్తుత ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పాలనను ప్రస్తావించడం ఆయన రాజకీయ పరిణతికి లేదా వ్యూహాత్మక మార్పునకు అద్దం పడుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నన్ను టార్గెట్ చేసినందుకే అలాంటి వ్యాఖ్యలు చేశా ! - పవన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha