Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"బుమ్రా ఏమీ యంత్రం కాదు".. కీరన్ పొలార్డ్

"బుమ్రా ఏమీ యంత్రం కాదు".. కీరన్ పొలార్డ్

వార్త 3 weeks ago

Jasprit Bumrah: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రదర్శనపై వస్తున్న విమర్శల పట్ల ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ స్పందించారు.

బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా భారీగా పరుగులు సమర్పించుకోవడం చర్చనీయాంశమైంది.

Read Also:Vinod Kambli at Wankhede Stadium: వాంఖడేలో ప్రత్యక్షమైన వినోద్ కాంబ్లీ

బుమ్రా వైఫల్యంపై పొలార్డ్ విశ్లేషణ

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో 13.50 ఎకానమీతో 54 పరుగులు ఇచ్చారు. ఈ ప్రదర్శనపై పొలార్డ్ సానుకూలంగా స్పందించారు.బుమ్రా ఏమీ యంత్రం కాదని, ఒక మనిషిగా తప్పులు చేయడం సహజమని పొలార్డ్ పేర్కొన్నారు.ప్రస్తుతం బుమ్రా కొంత పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నారని, అయితే త్వరలోనే ఆయన ఫామ్ లోకి వస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, ఇన్నాళ్లుగా ముంబై ఇండియన్స్‌కు, భారత్‌కు బుమ్రా నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నారని గుర్తు చేశారు.

 Pollard Comments on Bumrah Form

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడగా, అందులో 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలుకావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. అయితే జట్టు ఇంకా ఆశలు వదులుకోలేదని పొలార్డ్ స్పష్టం చేశారు.ముంబై జట్టు ఇంకా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.టోర్నీలో ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని, వాటిలో గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

రాజస్థాన్ 'డైమండ్' పై ముంబై కన్ను!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha