Vinod Kambli at Wankhede Stadium: ముంబైలోని వాంఖడే స్టేడియం బుధవారం రాత్రి ఒక భావోద్వేగ సన్నివేశానికి వేదికైంది. ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ స్టేడియానికి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Read Also:MI vs SRH: ఎస్‌ఆర్‌హెచ్‌తో ఓటమిపై హార్దిక్ పాండ్యా ఎమోషనల్ కామెంట్స్
Vinod Kambli at Wankhede Stadium: వాంఖడేలో కాంబ్లీ సందడి
ఒకప్పుడు తన బ్యాటింగ్‌తో మైదానాన్ని హోరెత్తించిన కాంబ్లీ, చాలా కాలం తర్వాత తన సొంత గడ్డపై కనిపించడం విశేషం.54 ఏళ్ల కాంబ్లీ ఆరోగ్య సమస్యల కారణంగా కొంత నీరసంగా కనిపించారు. స్టేడియం లోపలికి నడిచేందుకు ఆయన ఇద్దరు సహాయకుల తోడ్పాటు తీసుకోవలసి వచ్చింది.తెల్లటి చెక్స్ షర్ట్, బ్రౌన్ ప్యాంట్ ధరించి ఆయన సాధారణంగా కనిపించినప్పటికీ,
ముఖంలో మాత్రం మునుపటి ఉత్సాహం చెక్కుచెదరలేదు.స్టాండ్స్‌లో ఉన్న ఒక అభిమాని "గెట్ వెల్ సూన్, సర్" (త్వరగా కోలుకోండి సర్) అని గట్టిగా అరవగా, కాంబ్లీ అక్కడ ఆగాడు. అభిమాని వైపు చూసి, థంబ్సప్ చూపిస్తూ "థ్యాంక్యూ" అని బదులిచ్చాడు. ఈ చిన్న సంభాషణ అక్కడున్న వారిని ఎంతగానో కదిలించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
మా ఓపెనర్లకు బౌలింగ్ చేయనందుకు సంతోషం:కమిన్స్

