Dailyhunt
రాజస్థాన్ 'డైమండ్' పై ముంబై కన్ను!

రాజస్థాన్ 'డైమండ్' పై ముంబై కన్ను!

వార్త 2 weeks ago

Vaibhav Suryavanshi: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపుతున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం ఎదుర్కొంటూ అతను చూపుతున్న ప్రతిభ ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షిస్తోంది.

Read Also:Pat Cummins: మా ఓపెనర్లకు బౌలింగ్ చేయనందుకు సంతోషం:కమిన్స్

ముంబై ఇండియన్స్ గురి ఆ 'వజ్రం' పైనే!

రాజస్థాన్ రాయల్స్ జట్టు 13 లేదా 14 ఏళ్ల వయసులో ఉన్న వైభవ్ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు అతను ఆడుతున్న తీరు చూస్తుంటే, రాజస్థాన్ తన 'పోస్టర్ బాయ్'ని కాపాడుకోవడం కష్టమని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డారు.

 Vaibhav Suryavanshi IPL Price

Vaibhav Suryavanshi: బ్రాడ్ విశ్లేషణలోని ముఖ్యాంశాలు

ఒకవేళ వైభవ్ మళ్లీ వేలంలోకి వస్తే అతని ధర రూ. 30 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని బ్రాడ్ పేర్కొన్నారు.ముంబై ఇండియన్స్ వంటి దిగ్గజ జట్లు వైభవ్‌ను సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉంటాయని ఆయన విశ్లేషించారు.ఐపీఎల్‌లో ఏ ఆటగాడితోనూ 10 ఏళ్ల సుదీర్ఘ కాంట్రాక్ట్ కుదుర్చుకోలేమని, కాబట్టి రాజస్థాన్ రాయల్స్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.ఇంత చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాడిని గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ స్కౌటింగ్ టీంను బ్రాడ్ అభినందించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

వాంఖడేలో ప్రత్యక్షమైన వినోద్ కాంబ్లీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha