Bank of Baroda: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) కు చెందిన రూ. కోట్లాది విలువైన అత్యంత సున్నితమైన డేటా హ్యాకింగ్‌కు గురైనట్లు మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
బ్యాంక్‌కు చెందిన వ్యక్తిగత మరియు కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలు, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, నెట్ బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కినట్లు పలు కథనాలు వెలువడ్డాయి.
Read Also :Gas ekyc: గ్యాస్ కనెక్షన్‌కు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే కనెక్షన్ రద్దు !
ఏ ఏ డేటా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి?

భారతదేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లకు చెందిన కీలక సమాచారం హ్యాక్ అయిందని కథనాలు పేర్కొంటున్నాయి.
- కస్టమర్ల సమాచారం: ఖాతాదారుల పేర్లు, ఆధార్ వివరాలు, సేవింగ్స్ మరియు కరెంట్ ఖాతాల రికార్డులు.
- రుణాలు & అకౌంట్స్: కస్టమర్ల లోన్ డేటా, లోన్ అప్రైజల్ డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫారాలు.
- డిజిటల్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్ యూజర్ వివరాలు, NRI సేవలు, కార్పొరేట్ బ్యాంకింగ్ సర్వీస్ రికార్డులు.
- అంతర్గత వివరాలు: బ్రాంచ్ ఆడిట్ రిపోర్టులు, bobWorld యాప్ ఆడిట్ నివేదికలు, విచారణలు (Vigilance Investigations) మరియు బ్యాంకు అంతర్గత కమ్యూనికేషన్స్.
- ఇతర వివరాలు: కస్టమర్ సపోర్ట్ మెటీరియల్, బ్రాంచ్ మరియు ఏటీఎంలకు సంబంధించిన కీలక రికార్డులు.
Bank of Baroda: హ్యాకర్లపై స్పష్టత కరువు
ఈ భారీ డేటా లీక్‌కు సంబంధించి ఎలాంటి హ్యాకింగ్ గ్రూప్ లేదా హ్యాకర్లు ఇప్పటివరకు అధికారికంగా బాధ్యత వహించలేదు.
నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!

