Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్యాంకింగ్ వ్యవస్థకు ఆర్‌బీఐ షాక్.. రూ.7 లక్షల కోట్లు వెనక్కి!

బ్యాంకింగ్ వ్యవస్థకు ఆర్‌బీఐ షాక్.. రూ.7 లక్షల కోట్లు వెనక్కి!

వార్త 2 weeks ago

RBI VRRR Auction: దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లభ్యమయ్యే నగదు) రికార్డు స్థాయికి చేరుకోవడంతో భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక చర్యకు శ్రీకారం చుట్టింది.

బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అధిక మిగులు నగదును అదుపు చేసేందుకు గాను, సోమవారం రూ. 7 లక్షల కోట్లను 30 రోజుల వ్యవధికి వెనక్కి తీసుకునేందుకు 'వేరియబుల్ రేట్ రివర్స్ రెపో' (VRRR) వేలాన్ని నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతంలో గరిష్టంగా 15 రోజుల కాలపరిమితితో నిధులను స్వీకరించిన ఆర్‌బీఐ, ఈసారి ఏకంగా 30 రోజుల పాటు నిధులను తమ వద్ద ఉంచేలా చర్యలు చేపట్టడం స్వల్పకాలిక మనీ మార్కెట్‌పై కేంద్ర బ్యాంకుకు మరింత పట్టును అందించనుంది.

Read Also :Gold Price Today: పెరిగిన బంగారం ధరలు

RBI VRRR Auction: నగదు ప్రవాహానికి ప్రధాన కారణాలు & ఆర్‌బీఐ ముందున్న సవాళ్లు

ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో సుమారు రూ. 10.5 లక్షల కోట్ల అధిక మిగులు నగదు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశాల్లోని భారతీయుల (NRI) నుంచి డాలర్ డిపాజిట్లను ఆకర్షించేందుకు ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన పథకం రికార్డు స్థాయిలో విజయం సాధించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఈ పథకం ముగిసే సమయానికి దాదాపు 127 బిలియన్ డాలర్లు డిపాజిట్ల రూపంలో వచ్చాయి. ఆర్‌బీఐ ఈ విదేశీ కరెన్సీని రూపాయల్లోకి మార్చడంతో మార్కెట్లోకి పెద్ద మొత్తంలో నగదు ప్రవహించింది. రుణ సదుపాయాలతో కలిపి మొత్తం 136.4 బిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థలోకి వచ్చాయి. నగదు విపరీతంగా పెరిగిపోవడంతో బ్యాంకుల మధ్య రాత్రికి రాత్రి జరిగే రుణాల వడ్డీ రేటు (CALL Rate) ఆర్‌బీఐ నిర్ణయించిన పాలసీ రేటు కంటే దిగువకు పడిపోయింది. స్థూల ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా, మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడుతూ ఈ మిగులు నగదును క్రమంగా ఉపసంహరించుకోవడమే ఆర్‌బీఐ ముందున్న ప్రధాన లక్ష్యం.

'జియో'కు 10 వసంతాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha