Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చార్‌ధామ్ యాత్రలో సరికొత్త రికార్డు

చార్‌ధామ్ యాత్రలో సరికొత్త రికార్డు

వార్త 1 week ago

Chardham Yatra 2026: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతికూల వర్షాకాల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు కావడం విశేషం.

ఈ యాత్రా సీజన్ ప్రారంభమైన 114 రోజుల్లోనే మొత్తం 47,02,703 మంది భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 4,68,556 మంది అధికం.

Read Also :Komuravelli Mallanna Temple Train:మల్లన్న భక్తులకు రైల్వే తీపి కబురు

క్షేత్రాల వారీగా భక్తుల రాక

  • బద్రీనాథ్: 16,12,112 మంది భక్తులు (గతేడాదితో పోలిస్తే 3.5 లక్షల మందికి పైగా అధికం)
  • కేదార్‌నాథ్: 14,50,116 మంది
  • గంగోత్రి: 7,37,629 మంది
  • యమునోత్రి: 6,62,347 మంది
  • హేమకుండ్ సాహిబ్: 2,40,499 మంది

Chardham Yatra 2026: ప్రభుత్వం, విపత్తు నిర్వహణ చర్యలు

భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. రాష్ట్ర విపత్తు నియంత్రణ గది నుంచి ఆయన స్వయంగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం విపత్తు నిర్వహణ బృందాలు 24 గంటలూ సిద్ధంగా ఉన్నాయి. వాతావరణం అనుకూలించని సమయంలో యాత్రికుల కదలికలను నియంత్రిస్తూ, యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. సోమవారం వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ 15,376 మంది భక్తులు యాత్రలో పాల్గొన్నారు.

దుర్గమ్మ భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha