Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దుర్గమ్మ భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్

దుర్గమ్మ భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్

వార్త 2 weeks ago

Vijayawada durga gudi:విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అద్భుతమైన వసతులు అందుబాటులోకి వస్తున్నాయి.

సరికొత్త హంగులతో నిర్మించిన లడ్డూ పోటు అలాగే అన్నప్రసాద కేంద్రం కొత్త భవనాలు ఈ నెల 21న లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నాటికి ఈ రెండు భవనాలు భక్తులకు పూర్తి స్థాయిలో సేవలు అందించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు. ఇరవై ఆరు కోట్ల రూపాయల భారీ వ్యయంతో రెండు అంతస్తులలో అన్నదాన భవనం అలాగే ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఐదు అంతస్తులలో మహాప్రసాద భవనాన్ని అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు నాణ్యమైన భోజనం అలాగే ఎంతో రుచికరమైన లడ్డూ ప్రసాదం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసింది.

Read also: Rajahmundry Crime: కాతేరు శివార్లలో తీవ్ర కలకలం: రక్తమడుగులో ప్రేమికులు.. అసలేం జరిగింది?

 Good news for devotees of the Vijayawada Durga Temple.

శ్రీకనకదుర్గ అన్నప్రసాద సదరం

ఇంద్రకీలాద్రిపై నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ రెండు అతధునిక భవనాలకు దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేకమైన పేర్లను అధికారికంగా ఖరారు చేశారు. అన్నదాన భవనానికి శ్రీకనకదుర్గ అన్నప్రసాద సదరం అని అలాగే ప్రసాదాల తయారీ భవనానికి శ్రీదుర్గాభవానీ మహాప్రసాద భవనంగా నామకరణం చేయడం జరిగింది. ఇప్పటివరకు అన్నప్రసాదం బయటి ప్రాంతాలలో వండించి ఆలయానికి తీసుకువచ్చి భక్తులకు వడ్డించడం జరుగుతోంది. కానీ ఈ కొత్త అన్నప్రసాద భవనం అందుబాటులోకి వచ్చిన వెంటనే ఇక్కడి వంటశాలలోనే వేడివేడిగా వంట చేసి భక్తులు అందరూ ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసే అద్భుతమైన సదుపాయం కలుగుతుంది. మహాప్రసాద భవనంలో కేటాయించిన ప్రత్యేక అంతస్తులలో నిత్యం లడ్డూలు ఇతర ప్రసాదాలు ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో తయారవుతాయి. భక్తుల నుంచి వస్తున్న అభిప్రాయాలను ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా స్వీకరించగా గత రెండు నెలలుగా దుర్గమ్మ ఆలయం సేవల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

Vijayawada durga gudi:దసరా ఉత్సవాల నాటికి పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి

ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభం కానున్న ఈ నూతన భవనాలకు సంబంధించిన లోపల రంగుల పనులు అలాగే చిన్నచిన్న ఫినిషింగ్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. దసరా మహోత్సవాల సమయంలో దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్మాణాలను అత్యంత పకడ్బందీగా తీర్చిదిద్దారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మెరుగైన దర్శనం, నాణ్యమైన ప్రసాదం, అన్నదానం వంటి అన్ని విభాగాలలోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆలయ పాలకమండలి పనిచేస్తోంది. ఈ రెండు ప్రతిష్టాత్మక భవనాలు ప్రారంభమవడం ద్వారా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల అనుభూతి పూర్తిగా మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భక్తుల సౌకర్యమే పరమావధిగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు అందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నారు.

Epaper: epaper.vaartha.com

వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ భారీ ఆర్థిక సాయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha