Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడే హుస్నాబాద్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక?

నేడే హుస్నాబాద్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక?

వార్త 1 week ago

Husnabad Co-option Members Election: హుస్నాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నేడే జరగనున్నట్లు పట్టణ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఉదయం 11 గంటలకు హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం వెలువడడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.గత కొన్ని రోజులుగా కో ఆప్షన్ సభ్యుల ఎంపికపై హుస్నాబాద్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. దాదాపు పది మంది వరకు ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం.

Read Also:Medak Adarsh Bank Fraud: మెదక్ పట్టణంలోని ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఘరానా మోసం

అయితే కేవలం నలుగురికి మాత్రమే అవకాశం ఉండటంతో చివరి నిమిషం వరకు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్లు తెలుస్తోంది.నియమాల ప్రకారం ఒక బీసీ, ఒక ఓసీ, ఒక మైనార్టీ, ఒక క్రిస్టియన్ వర్గాలకు కో ఆప్షన్ సభ్యత్వం ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం కొన్ని పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ వర్గం నుంచి పున్న సది, ఓసీ వర్గం నుంచి ఐలేని అనిత, మైనార్టీ వర్గం నుంచి ఎండి హస్సన్, క్రిస్టియన్ వర్గం నుంచి ఖాత గ్లోరీనా పేర్లు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

Husnabad Co-option Members Election: బలంగా వినిపిస్తున్న పేర్లు ఇవే..

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమోదంతోనే ఈ ఎంపికలు జరుగుతున్నాయని ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు పదవులు ఆశించి అవకాశం దక్కని మిగతా ఆశావాహులను సమన్వయం చేసుకోవాలని స్థానిక నాయకత్వానికి సూచనలు వెళ్లినట్లు సమాచారం. దీంతో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కేవలం సాధారణ ప్రక్రియ కాకుండా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రస్తుతం హుస్నాబాద్ పట్టణంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. "చివరి నిమిషంలో మార్పులు ఉంటాయా..?",

"ఇప్పటివరకు వినిపిస్తున్న పేర్లకే అవకాశం దక్కుతుందా..?", "మంత్రి సమక్షంలో ఎలాంటి ప్రకటన వెలువడనుంది..?" అన్న ప్రశ్నలు కార్యకర్తలు, ఆశావాహుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత నేడు ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యాకే వచ్చే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో జరగనున్న సమావేశం రాజకీయంగా కీలకంగా మారగా.. ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగి.. చివరి క్షణాల్లో వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతాయా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha