Illegal Mining Sangareddy: సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండల పరిధిలో అక్రమ నల్ల మట్టి, మొరం వ్యాపారం జోరుగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గత రెండు మూడు నెలలుగా రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా నల్ల మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తూ అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా చౌట్కూర్ శివారు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మొరం, నల్ల మట్టి తరలింపు జరుగుతున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also:Medak Adarsh Bank Fraud: మెదక్ పట్టణంలోని ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఘరానా మోసం
Illegal soil and moram transport
Illegal Mining Sangareddy: దెబ్బతింటున్న రహదారులు.. పొంచి ఉన్న ప్రమాదాలు
ప్రతి నెల మామూలు తీసుకుంటూ అధికారులు అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు రైతులు అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో భారీ టిప్పర్ల రాకపోకలతో గ్రామీణ రహదారులు దెబ్బతింటుండటంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి, మొరం తరలింపుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

