Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. ముగ్గురు జవాన్లు మృతి

వార్త 3 weeks ago

Chhattisgarh IED Blast: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల వికృత చర్యకు ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) జవాన్లు బలయ్యారు. గతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను తొలగించే ప్రక్రియలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

ఈ పేలుడులో మరో జవాను తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాంకేర్, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఏరియా డామినేషన్ ఆపరేషన్ చేపట్టాయి. ఛోటే బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు పాతిపెట్టిన ఐఈడీలను గుర్తిస్తున్న క్రమంలో, ఒక శక్తిమంతమైన బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ దుర్ఘటనలో ఇన్‌స్పెక్టర్ సుఖ్‌రామ్ వట్టి, కానిస్టేబుల్ కృష్ణ కోమ్రా, కానిస్టేబుల్ సంజయ్ గఢ్‌పాలే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ పర్మానంద్ కోమ్రాను మెరుగైన వైద్యం కోసం తరలించారు.

Read Also: Kavitha: నేను విమర్శించింది పార్టీ అధ్యక్షుడినే, తండ్రిని కాదు.. కవిత స్పష్టత

 Three DRG jawans martyred in IED blast.

Chhattisgarh IED Blast: ఐజీ స్పందన

బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పట్టిలింగం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. నిఘా వర్గాల సమాచారం మరియు లొంగిపోయిన మావోయిస్టుల గుర్తింపు మేరకు ఇప్పటికే వందలాది ఐఈడీలను విజయవంతంగా నిర్వీర్యం చేశామని, అయితే నేడు బాంబును డిఫ్యూజ్ చేస్తున్న సమయంలో ఊహించని విధంగా పేలుడు జరగడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. వీరమరణం పొందిన జవాన్ల త్యాగం వృధా పోదని ఆయన స్పష్టం చేశారు.

డీఆర్‌జీ దళాల ప్రాముఖ్యత

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో స్థానిక యువతతో కూడిన ‘డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్’ (DRG) కీలక పాత్ర పోషిస్తోంది. మార్చి 31న రాష్ట్రాన్ని సాయుధ మావోయిస్టు రహితంగా ప్రకటించిన తర్వాత జరిగిన తొలి ప్రధాన పేలుడు ఇదే కావడం భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. అటవీ ప్రాంతాల్లో ఇంకా ఎక్కడైనా మందుపాతరలు ఉన్నాయేమోనన్న కోణంలో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

హామీలు నెరవేర్చకపోతే రాళ్లతో కొట్టండి: కవిత సంచలనం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha