Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేను విమర్శించింది పార్టీ అధ్యక్షుడినే, తండ్రిని కాదు.. కవిత స్పష్టత

నేను విమర్శించింది పార్టీ అధ్యక్షుడినే, తండ్రిని కాదు.. కవిత స్పష్టత

వార్త 3 weeks ago

Kavitha: తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తన తండ్రి కేసీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు.

శనివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో ఆమె పాల్గొని తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో తనకు ఉన్నది కేవలం సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప, వ్యక్తిగత సమస్యలు కావని ఆమె తేల్చి చెప్పారు.

“నేను మా నాన్నను విమర్శించలేదు.. ఒక రాజకీయ నాయకుడిగా, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాత్రమే కేసీఆర్ గారిని విమర్శించాను” అని కవిత స్పష్టం చేశారు. తండ్రిగా ఆయన లేకపోతే తనకు జన్మనే లేదని, ప్రతిరోజు పూజలో తల్లిదండ్రులను స్మరించుకుంటానని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. అయితే, ప్రజా సమస్యల విషయంలో తప్పు జరిగితే భవిష్యత్తులోనూ విమర్శిస్తానని, ఒకవేళ తాను తప్పు చేస్తే బీఆర్ఎస్ నేతలు కూడా తనను విమర్శించవచ్చని ఆమె సవాల్ విసిరారు.

Read Also: Sangareddy Agriculture:రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా నిర్వహణ

 Kalvakuntla Kavitha’s clarification on comments against KCR

Kavitha: నీటి ప్రాజెక్టులు, నిధుల దుర్వినియోగంపై ధ్వజం

తెలంగాణ ఏర్పడ్డాక వచ్చిన తొలి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనులు చేయలేకపోయిందని కవిత విమర్శించారు. ముఖ్యంగా నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఆమె ఎండగట్టారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల కోసం రూ. 1.21 లక్షల కోట్లు ఖర్చు చేసినా, కేవలం ఒక లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు అందడం ఏంటని ఆమె ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదుల నీటిని సమర్థవంతంగా వినియోగించుకుని ఉంటే రైతుల పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు.

పేపర్ లీకేజీలపై ప్రశ్నలు

నిరుద్యోగ యువత పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కవిత మండిపడ్డారు. ప్రపంచ దేశాల్లో గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే కేటీఆర్ లాంటి ఐటీ మంత్రి ఉండగా, తెలంగాణలో ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలన వల్ల రెండు తరాల యువత తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ధ్వజమెత్తారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గుమ్మడిదల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ ఆధిపత్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha