Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చేనేత సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవం

చేనేత సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవం

వార్త 1 week ago

Peddashankarampet Handloom Society: పెద్దశంకరంపేట చేనేత సహకార సంఘం ఎన్నికలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవమయ్యాయని ఎన్నికల అధికారి ఎండి యాకూబ్అలీ తెలిపారు.

చేనేత సహకార సంఘం అధ్యక్షులుగా మహంకాళి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా నంశంగారి సంతోష్ కుమార్లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Read also: Harish Rao on DTO Venkanna: డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు!

 Handloom Cooperative Society election unanimous

Peddashankarampet Handloom Society: నూతన కమిటీ సభ్యుల ఎన్నిక

కాగా నూతనంగా ఏర్పడిన కమిటీలో 9 మంది సభ్యులను నందయ్యగారి మధు, దొడ్ల సంగమేశ్వర్, నoశంగారి గారి శ్రీనివాస్, ఎర్ర శ్రీహరి, జంగం రాములు, నంశంగారి సంతోష్, చందుబట్ల నవీన్ కుమార్, బుచ్చవ్వ, కృష్ణమూర్తి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులోనుండి సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులను సభ్యులు ఎన్నుకున్నారు. ఏకగ్రీవమైన సభ్యులకు ఎన్నికల అధికారి ఎండి యాకూబ్ఆలీ ధ్రువపత్రాలను అందజేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన మహంకాళి కృష్ణమూర్తి గతంలో 2008 సంవత్సరంలో కూడా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

నూతన కమిటీకి అభినందనలు

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు గుజ్జరి కనకరాజు, నీలికుల సంఘం అధ్యక్షులు దశ్వంత్, తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ చేనేత కార్మికుల సంక్షేమం, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సభ్యులు ఆకాంక్షించారు.

భువనగిరి కోటకు కొత్త ఆకర్షణ.. అక్టోబర్ నాటికి అందుబాటులోకి రోప్‌వే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha