CSK Performance IPL 2026 :ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుత పరిస్థితిపై అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2026 సీజన్‌లో వరుస ఓటములతో కుంగిపోతున్న ఆరెంజ్ ఆర్మీ (సారీ, ఎల్లో ఆర్మీ) ప్రదర్శనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి..
Read Also:CSK IPL 2026 Match Score: చెన్నై (CSK).. 17 ఓవర్లలో 180/8
పతనం దిశగా పయనం
ఒకప్పుడు ప్లే-ఆఫ్స్ అంటే చెన్నైదే అన్నట్టు ఉండే పరిస్థితి ఇప్పుడు తలకిందులైంది.2023లో ఐదోసారి కప్పు గెలిచిన జోరు.. 2024లో ఐదో స్థానంతో తగ్గడం మొదలైంది.2025 సీజన్‌లో కేవలం 4 విజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచిన సీఎస్కే, 2026లో అంతకంటే హీనమైన స్థితికి చేరుతుందా అన్న భయం అభిమానుల్లో మొదలైంది.
CSK Performance IPL 2026: ఈ సీజన్ వైఫల్యాలు - ముఖ్యాంశాలు
రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోవడంతో ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు.తమ సొంత మైదానమైన చెపాక్‌లో 200కు పైగా పరుగులు చేసినా.. బౌలర్లు దానిని కాపాడుకోలేకపోవడం జట్టు బలహీనతను బయటపెట్టింది.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సీఎస్కే బౌలింగ్‌ను ప్రత్యర్థి బ్యాటర్లు చీల్చిచెండాడటంతో జట్టు పరువు గాలిలో కలిసిపోయింది.
CSK downfall in IPL 2026
రాజస్థాన్‌పై 12.1 ఓవర్లలోనే 128 పరుగులు సమర్పించుకుని మ్యాచ్‌ని అప్పగించిన సీఎస్కే.. పంజాబ్ కింగ్స్‌పై 209 పరుగులు చేసి 18.4 ఓవర్లలోనే ఓడిపోయారు. ఇక ఆర్సీబీపై 251 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పోరాడినప్పటికీ 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మూడు మ్యాచ్‌లలో ఒక్కదాంట్లో కూడా ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ రాణించలేదు.
సీఎస్కేలో మార్పు వస్తుందా?
సీఎస్కే మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోనీ కాలి కండరాల గాయంతో రెండు వారాల పాటు ఐపీఎల్‌కు దూరమవ్వడం కూడా ఆ జట్టు ఓటములకు కారణంగా కనిపిస్తోంది. దాంతో పాటు డేంజరస్ బ్యాటర్ డివాల్డ్ బ్రెవిస్‌కు ఇంజ్యూరీ కావడం.. సరైన పేస్ బౌలింగ్ లేకపోవడం సీఎస్కే పతనాలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. మూడు మ్యాచ్‌లలో దారుణ ఓటముల తర్వాత అయినా సీఎస్కేలో మార్పు వస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఫ్యాన్స్ రియాక్షన్
ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్ బేస్ కలిగిన జట్లలో రెండో స్థానంలో ఉన్న సీఎస్కే అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా మేనేజ్‌మెంట్ నిర్ణయాలపై మండిపడుతున్నారు. "ఛాంపియన్ జట్టుకు ఇలాంటి పరిస్థితి రావడం జీర్ణించుకోలేకపోతున్నాం" అంటూ నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

