Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెన్నైలో టీవీకే కార్యకర్తల గర్జన.. లోక్‌భవన్ ముందు ఉద్రిక్తత!

చెన్నైలో టీవీకే కార్యకర్తల గర్జన.. లోక్‌భవన్ ముందు ఉద్రిక్తత!

వార్త 3 months ago

Tamil Nadu: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమ అధినేత విజయ్‌ను ఆహ్వానించడంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ జాప్యం చేస్తున్నారంటూ 'తమిళగ వెట్రి కళగం' (TVK) శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ మేరకు చెన్నైలోని గవర్నర్ అధికారిక నివాసం ‘లోక్‌భవన్’ (రాజ్ భవన్) ముందు టీవీకే కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు.

Read Also :TVK ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్దపడ్డారా ?

Tamil Nadu: గవర్నర్ తీరుపై ధ్వజం

అత్యధిక సీట్లు సాధించిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు తక్షణమే ఆహ్వానించాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు నిరసన గళం విప్పారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, ప్రజా తీర్పును గౌరవించకుండా గవర్నర్ రాజకీయాలకు తావిస్తున్నారని వారు ఆరోపించారు. విజయ్‌ను వెంటనే సీఎంగా ప్రమాణస్వీకారం చేయించాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు.

లోక్‌భవన్ వద్ద భారీ భద్రత

టీవీకే కార్యకర్తలు ఒక్కసారిగా లోక్‌భవన్ వైపు దూసుకురావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. నిరసన చేస్తున్న పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నిరసనల నేపథ్యంలో రాజ్ భవన్ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు, గవర్నర్ తీరుపై విజయ్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న తరుణంలో, క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఆందోళనలు తమిళ రాజకీయాల్లో మరింత వేడిని పుట్టిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మ్యాజిక్ ఫిగర్ లేకుండా విజయ్ ప్రమాణస్వీకారం జరగదు: గవర్నర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha