ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు కష్టాలు ముదురుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోవాల్సిన తరుణంలో కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చెన్నైకి భారీ షాక్ తగిలింది. యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన కుడి కాలికి ఫ్రాక్చర్ అయినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుత సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉండరని CSK యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. బౌలింగ్ మరియు బ్యాటింగ్‌లో జట్టుకు సమతుల్యతను అందించే ఘోష్ దూరం కావడం చెన్నైకి కోలుకోలేని దెబ్బ.
Read Also : అభిమాని కోసం రంగంలోకి దిగిన ప్రీతి జింటా

గాయాల కటకటలో ‘ఎల్లో ఆర్మీ’
ఈ సీజన్‌లో చెన్నై జట్టును గాయాల సమస్య నీడలా వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ బౌలర్లు నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్‌తో పాటు యువ ఆటగాడు ఆయుష్ మాత్రే జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు రామకృష్ణ ఘోష్ కూడా ఆ జాబితాలో చేరారు. కేవలం దూరం కావడమే కాకుండా, మైదానంలో ఉన్న కీలక ఆటగాళ్లు కూడా పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడం జట్టును ఇబ్బంది పెడుతోంది. డెత్ ఓవర్ల స్పెషలిస్టులు లేకపోవడంతో బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది.
ధోనీ ఫిట్‌నెస్‌పై వీడని ఉత్కంఠ
అన్నింటికంటే ముఖ్యంగా జట్టు ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీ కూడా మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు డెవాల్డ్ బ్రెవిస్, స్పెన్సర్ జాన్సన్ వంటి విదేశీ ఆటగాళ్లు కూడా చిన్న చిన్న గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమైన ప్లే-ఆఫ్స్ దశకు చేరుకుంటున్న సమయంలో, ఇంతమంది కీలక ఆటగాళ్లు గాయపడటం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు పెద్ద సవాల్‌గా మారింది. అందుబాటులో ఉన్న వనరులతో ధోనీ సేన ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

