CSK vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ చెపాక్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈక్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్ చేయనుంది.
Read Also: Rassie van der Dussen Retired: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే చెరొక మ్యాచ్ ఆడాయి. గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే దారుణ ఓటమిపాలవ్వగా.. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి తొలి విజయాన్ని నమోదు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ చూస్తోంది.
CSK vs PBKS IPL 2026: గత సీజన్‌లో పంజాబ్ దే ఆధిపత్యం..
Chennai vs Punjab Head to Head
చెన్నై, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌లు ఎప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఈ రెండు జట్లు 33 సార్లు తలపడ్డాయి. వీటిలో చెన్నై 17 మ్యాచ్‌లు గెలవగా, పంజాబ్ కేన్సర్ 15 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ టై కాగా, దానిని పంజాబ్ సూపర్ ఓవర్‌లో గెలుచుకుంది. గత సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ పంజాబ్, చెన్నైని ఓడించింది. చేపాక్‌లో ఈ రెండు జట్లు తొమ్మిది సార్లు తలపడగా, చెన్నై నాలుగు సార్లు, పంజాబ్ ఐదు సార్లు గెలిచాయి. ఇక్కడ జరిగిన చివరి మూడు మ్యాచ్‌లలో పంజాబ్ కేన్సర్ విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
రుతురాజ్ గైక్వాడ్ (కెెప్టెన్), సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, కార్తీక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ.
పంజాబ్ కింగ్స్ జట్టు
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్షు ఆర్య, కూపర్ కాన్‌లీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినీస్, మార్కో యాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాక్, యుజ్వేంద్ర చాహల్.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

