Dailyhunt
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్

వార్త 2 weeks ago

Rassie van der Dussen Retired: దక్షిణాఫ్రికా (South Africa) క్రికెట్ అభిమానులకు ఇది ఒక భావోద్వేగ క్షణం. ఆ జట్టు నమ్మదగ్గ మిడిలార్డర్ బ్యాటర్ రస్సీ వాన్‌డెర్ డసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

తన అద్భుతమైన కెరీర్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన డసెన్, తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రొటీస్ బోర్డుకు, సహచర ఆటగాళ్లకు, అండగా నిలిచిన కోచ్‌లు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also:Yuvraj Singh Apologizes MS Dhoni: ధోనీ, కపిల్‌లకు క్షమాపణలు చెప్పిన యువరాజ్

Rassie van der Dussen Retired: సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశం

తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అత్యంత భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశాడు. "దక్షిణాఫ్రికా జెర్సీని ధరించడం అనేది ఓ ఆటగాడిగా నా జీవితంలో అత్యున్నత శిఖరం. ఈ ప్రయాణం నా పట్టుదలను, అంకితభావాన్ని నిరంతరం పరీక్షిస్తూనే.. మరిచిపోలేని గౌరవాన్ని అందించింది. నా దేశం కోసం ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో దక్కిన అతిపెద్ద పురస్కారంగా భావిస్తాను" అని రాస్సీ వాన్ డెర్ డస్సెన్ రాసుకొచ్చాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నా.. దేశవాళీ క్రికెట్లో తన జట్టు 'లయన్స్' తరఫున ఆడతానని, భవిష్యత్తులో కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించే ఆలోచన ఉందని రాస్సీ వాన్ డెర్ డస్సెన్ స్పష్టం చేశాడు.

2018 అక్టోబర్ 9న డస్సెన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికా తరఫున 71 వన్డేలు, 18 టెస్టులు, 57 టీ20ల్లో ఆడాడు. ముఖ్యంగా వన్డేల్లో ప్రోటీస్‌కు కీలక ప్లేయర్‌గా నిలిచాడు. 2019 జనవరి 19న వన్డే క్రికెట్ లోకి తొలిసారి అడుగుపెట్టాడు. అరంగేట్రంలోనే 90కి పైగా స్కోరు నమోదు చేసిన ఐదవ బ్యాటర్‌గా డస్సెన్ నిలిచాడు. అతడి పేరిట 6 వన్డే సెంచరీలు ఉన్నాయి. 2023, 2019 ప్రపంచకప్‌లలో సౌతాఫ్రికాకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో అతడు రాజస్థాన్ రాయల్స్‌ తరఫున ఆడాడు. మొత్తంగా డస్సెన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 4968 పరుగులు చేశాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అంపైర్ నిర్ణయంపై అసహనం: వివాదంలో చిక్కుకున్న అభిషేక్ శర్మ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha