Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెపాక్‌లో చెన్నై జోరు.. ముంబైపై ఘనవిజయం

చెపాక్‌లో చెన్నై జోరు.. ముంబైపై ఘనవిజయం

వార్త 3 weeks ago

CSK vs MI Result: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అద్భుత ప్రదర్శన చేసింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మరో 11 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది.

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 67 నాటౌట్), కార్తీక్ శర్మ (40 బంతుల్లో 54 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించారు.

Read Also:India Women's T20 World Cup Squad 2026: మహిళల టీ20 ప్రపంచకప్ 2026.. భారత జట్టు ప్రకటన

CSK vs MI Result: ఆరంభంలో తడబడినా.. భాగస్వామ్యంతో నిలబడి

160 పరుగుల ఛేదనలో చెన్నైకి ఆరంభం ఆశాజనకంగా లేదు. సంజూ శాంసన్ (11), ఉర్విల్ పటేల్ (24) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో చెన్నై 62 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కార్తీక్ శర్మతో కలిసి గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 98 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు.

 CSK vs MI Result 2026

తక్కువ స్కోరుకే పరిమితమైన ముంబై

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ (57) ఒక్కడే అర్ధశతకంతో రాణించగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (18) నెమ్మదిగా ఆడి నిరాశపరిచాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3 వికెట్లతో సత్తా చాటగా, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

CSK టార్గెట్ ఎంతంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha