India Women's T20 World Cup Squad 2026: జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న మహిళల టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ (BCCI) శనివారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.
ఈ మెగా టోర్నీకి హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, స్టార్ బ్యాటర్ స్మృతి మంధన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ జట్టు ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలనే పట్టుదలతో ఉంది.
Read Also:Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తప్పిస్తారా? అసలు కారణం ఇదే!
సంచలనం నందిని శర్మ.. తిరిగి వచ్చిన యాస్తిక
ఈ జట్టు ఎంపికలో ప్రధాన ఆకర్షణ యువ ఫాస్ట్ బౌలర్ నందిని శర్మ. డబ్ల్యూపీఎల్ (WPL) 2026లో హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించిన నందిని, తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికైంది. మరోవైపు, గాయం కారణంగా గత వన్డే ప్రపంచకప్‌కు దూరమైన వికెట్ కీపర్ యాస్తిక భాటియా పునరాగమనం చేయగా, స్పిన్నర్ రాధా యాదవ్ కూడా చోటు దక్కించుకుంది. అయితే, గాయాల కారణంగా అమన్‌జోత్ కౌర్, కష్వీ గౌతమ్ ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యారు.
India Women's T20 World Cup Squad 2026: జట్టులో తెలుగు తేజాలు
తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు క్రీడాకారిణులు ప్రపంచకప్ జట్టుకు ఎంపికవ్వడం విశేషం. శ్రీ చరణి, అరుంధతి రెడ్డి తమ ప్రతిభతో 15 మంది సభ్యుల స్క్వాడ్‌లో స్థానం సంపాదించుకున్నారు. వీరు భారత్ విజయావకాశాల్లో కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
గ్రూప్-1లో భారత్.. తొలి పోరు పాక్‌తో
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. జూన్ 14న పాకిస్థాన్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. 2020లో రన్నరప్‌గా నిలిచిన భారత్, ఈసారి ఎలాగైనా కప్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ ప్రపంచకప్ కంటే ముందు, మే 28 నుంచి జూన్ 2 వరకు ఇంగ్లండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌లో కూడా ఇదే జట్టు ఆడనుంది.
టీ20 ప్రపంచ కప్ భారత జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి పుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీచరణి, యాస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకాసింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
చెన్నైలో 'ఎల్ క్లాసికో' సమరం.. టాస్ గెలిచిన ముంబై

