Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెపాక్‌లో చెన్నై 'సూపర్' బ్యాటింగ్: పంజాబ్ ముందు 210 పరుగుల లక్ష్యం

చెపాక్‌లో చెన్నై 'సూపర్' బ్యాటింగ్: పంజాబ్ ముందు 210 పరుగుల లక్ష్యం

వార్త 2 months ago

CSK vs PBKS Live Score: ఐపీఎల్ 2026 (IPL 2026)లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న 7వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

పంజాబ్ కింగ్స్ ముందు 210 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, మ్యాచ్‌పై పట్టు బిగించారు. శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుష్ మహాత్రే 73, శివమ్ దూబే 45, సర్ఫరాజ్ ఖాన్ 32 పరుగులు చేశారు. విజయకుమార్ వైశాఖ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Read Also:PM Modi Praises Sanju: "సంజూ లాగే బీజేపీ కార్యకర్తలు చెలరేగాలి".. ప్రధాని మోదీ

 CSK vs PBKS IPL 2026 Score Update

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్.

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్ మరియు యుజ్వేంద్ర చాహల్.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

చెపాక్‌లో చెన్నై బ్యాటింగ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha