Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెపాక్‌లో ముంబై చిత్తు.. CSK హిస్టారికల్ విక్టరీ

చెపాక్‌లో ముంబై చిత్తు.. CSK హిస్టారికల్ విక్టరీ

వార్త 5 months ago

CSK vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. చెన్నై బౌలర్లు అన్షుల్ కంబోజ్ (3 వికెట్లు), నూర్ అహ్మద్ (2 వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది.

నమన్ ధీర్ (57) ఒంటరి పోరాటం చేసినా, మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు.

Read Also: Hardik Pandya: "వాళ్లు స్మార్ట్ క్రికెట్ ఆడారు" హార్దిక్ పాండ్యా

CSK vs MI: రుతురాజ్ – కార్తీక్ శర్మ విధ్వంసం

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రుతురాజ్, యువ బ్యాటర్ కార్తీక్ శర్మ (54 నాటౌట్)తో కలిసి ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, మరో 11 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు.

 CSK vs MI Highlights 2026

ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌ను 20 సార్లు ఓడించిన ఏకైక జట్టుగా సీఎస్‌కే అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారగా, సీఎస్‌కే తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఆమె మాయలో పడ్డాడంటూ హార్దిక్ పై ఫ్యాన్స్ ఫైర్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha