Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"వాళ్లు స్మార్ట్ క్రికెట్ ఆడారు" హార్దిక్ పాండ్యా

"వాళ్లు స్మార్ట్ క్రికెట్ ఆడారు" హార్దిక్ పాండ్యా

వార్త 3 weeks ago

Hardik Pandya: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ఏమాత్రం కలిసి రావడం లేదు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమితో ముంబై తన 7వ పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ ఓటమి తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడిన మాటలు ఆ జట్టు పరిస్థితిని అద్దం పడుతున్నాయి.

Read Also:CSK vs MI IPL 2026 Live Score: CSK టార్గెట్ ఎంతంటే?

Hardik Pandya: సీజన్ మొత్తం విఫలమయ్యాం

హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. మూడు విభాగాల్లో చెన్నై సూపర్ కింగ్స్ తమకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్ తో పాటు ఈ సీజన్ మొత్తం తమకు కలిసి రాలేదు. ఈ పిచ్ పై 180 నుంచి 190 పరుగులు మంచి స్కోర్. ఓ దశలో మేము ఆ స్కోర్ చేయగలమని భావించాం. అది మంచి స్కోర్ అయ్యేది. కానీ, 10 ఓవర్ల తరువాత మా బ్యాటింగ్ దూకుడుగా ముందుకు సాగలేదని, మా బ్యాటింగ్ విభాగంలో పూర్తిగా విఫలమయ్యాం అని హార్దిక్ పేర్కొన్నాడు.బౌలింగ్ విభాగంలోనూ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాం. సీఎస్కే బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేశారు.

 Hardik Pandya reaction after MI vs CSK loss IPL 2026

సీఎస్కే బ్యాటర్లను కట్టడి చేయడానికి మాకున్న బౌలింగ్ వనరులతో మేము ప్రయత్నించాం. కానీ, వారు తెలివిగా బ్యాటింగ్ చేశారు. వాస్తవానికి ఈ పిచ్‌పై క్రీజులోకి రాగానే భారీ షాట్స్ ఆడటం అంత సులువు కాదు. చెన్నై బ్యాటర్లు కూడా సెట్ అయిన తరువాత కూడా భారీ షాట్స్ ఆడలేకపోయారు.ఇక్కడ లెక్కలతో కూడిన క్రికెట్ ఆడటం, చేతిలో వికెట్లు ఉంచుకోవడం కీలకం. ఆ ప్రణాళికలను మేము అమలు చేయలేకపోయామని హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో మూడు విభాగాల్లో చెన్నై తమకంటే మెరుగైన ప్రదర్శన చేసిందని, ఆ స్థాయింలో మేము రాణించలేకపోయామని హార్దిక్ పేర్కొన్నారు.

ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతేనా?

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ముంబై ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. మిగిలిన మ్యాచ్‌లన్నింటిలో గెలవడంతో పాటు, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చెపాక్‌లో చెన్నై జోరు.. ముంబైపై ఘనవిజయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha