Dailyhunt
చెపాక్‌లో రసవత్తర పోరు: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై ఢీ

చెపాక్‌లో రసవత్తర పోరు: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై ఢీ

వార్త 1 week ago

CSK vs DC: ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉన్న చెన్నైకి, నేడు ఢిల్లీతో జరగబోయే మ్యాచ్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే అత్యంత కీలకం.

చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ లైవ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు

Read Also:Bhuvneshwar Kumar on Vaibhav: '15 ఏళ్ల కుర్రాడు కొట్టాడని బాధ లేదు': భువనేశ్వర్

ధోనీ వస్తున్నాడా? – ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

సీఎస్‌కే అభిమానులకు అత్యంత ఆసక్తికరమైన విషయం ఎంఎస్ ధోనీ ఫిట్‌నెస్. గత మూడు మ్యాచ్‌లకు దూరమైన ధోనీ, కాలి కండరాల గాయం (Calf Strain) నుండి కోలుకుంటున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ధోనీ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, తుది జట్టులో ఆడటం అతని ఫిట్‌నెస్ టెస్ట్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ధోనీ ఆడితే అది జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.

 CSK vs DC IPL 2026 Match 18

CSK vs DC: జట్టు బలాబలాలు – కీలక మార్పులు

ఐపీఎల్ చరిత్రలో చెన్నై, ఢిల్లీ జట్లు ఇప్పటివరకు 31 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై పూర్తి ఆధిపత్యం కనబరిచింది.

చెన్నై సూపర్ కింగ్స్ విజయాలు: 19

ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలు: 12

చరిత్ర పరంగా చెన్నైకి అప్పర్ హ్యాండ్ ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ పరంగా ఢిల్లీ బలంగా కనిపిస్తోంది. కెఎల్ రాహుల్ గత మ్యాచ్ లో 90 పరుగులతో అద్భుతమైన ఫామ్ లో ఉండగా, లుంగి ఎన్గిడి తన బౌలింగ్ తో బ్యాటర్లను వణికిస్తున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనా

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, డివాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అంచనా

కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సాంక, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, విప్‌రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, టి.నటరాజన్, ముకేశ్ కుమార్.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

"ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది!": శశి థరూర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha