Dailyhunt
"ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది!": శశి థరూర్

"ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది!": శశి థరూర్

వార్త 1 week ago

Shashi Tharoor Tweet on Vaibhav: ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న ప్రకంపనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.

కేవలం క్రికెట్ అభిమానులే కాదు, రాజకీయ దిగ్గజాలు సైతం ఈ యువ ఆటగాడి బ్యాటింగ్‌కు దాసోహమంటున్నారు. తాజాగా, తన అనర్గళమైన ఇంగ్లీష్ పదజాలంతో ప్రపంచాన్ని ఆకట్టుకునే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, వైభవ్ ఆటతీరుపై సోషల్ మీడియా వేదికగా ఉద్వేగభరితమైన పోస్ట్ చేశారు.

Read Also:Vaibhav Suryavanshi: 26 బంతుల్లో 78 రన్స్.. కోహ్లీ నుంచి స్పెషల్ గిఫ్ట్!

Shashi Tharoor Tweet on Vaibhav: “అతను అవుట్ అయ్యాకే నా పని మొదలైంది”

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 78 పరుగుల వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన వెంటనే థరూర్ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించారు. వైభవ్ జనరేట్ చేస్తున్న బ్యాట్ స్పీడ్, అతని టైమింగ్ చూస్తుంటే తనకు ఊపిరి ఆగిపోయినంత పని అవుతోందని ఆయన అన్నారు. వైభవ్ కేవలం క్రికెట్ ఆడటం లేదు, కొత్త తరం కోసం బ్యాటింగ్ నిర్వచనాన్ని మారుస్తున్నాడని 70 ఏళ్ల థరూర్ ప్రశంసించారు. ఒక అరుదైన, తరానికి ఒక్కడు పుట్టే ప్రతిభను మనం కళ్లారా చూస్తున్నామని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.

ఆర్సీబీ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు వైభవ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసిన వైభవ్, అందులో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ వంటి సీనియర్ బౌలర్లను నెట్ బౌలర్ల కంటే హీనంగా ఆడుకున్నాడు. యశస్వి జైస్వాల్ త్వరగా అవుట్ అయినా, ధ్రువ్ జురెల్ (81 నాటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు కేవలం 37 బంతుల్లో 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

'15 ఏళ్ల కుర్రాడు కొట్టాడని బాధ లేదు': భువనేశ్వర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha