Dailyhunt
చేపల వేటపై 61 రోజులు నిషేధం.. నేటి నుంచి అమలు

చేపల వేటపై 61 రోజులు నిషేధం.. నేటి నుంచి అమలు

వార్త 1 week ago

Fishing ban in AP: రాష్ట్రంలోని తీరప్రాంతంలో చేపల వేటపై ఈ నెల 15 నుంచి నిషేధం అమల్లోకి రానుంది. దీంతో బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం, చినగంజాం, తో పాటు జిల్లాలోని సముద్రతీరంలో వేటను అధికారులు నిషేధించారు.

చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో బొట్లు, వలలను మత్స్యకారులు ఒడ్డుకు తీసుకువచ్చి భద్రపరుస్తున్నారు. సముద్ర జీవసంపద పెంపుదల, చేపల సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ప్రతిఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు ప్రభుత్వం వేట విరామాన్ని ప్రకటిస్తుంది. ఈ కాలంలో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా కడలి పుత్రులకు ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని కూడా అందజేస్తోంది.

Read also: AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

Fishermen moving boats to the shore

Fishing ban in AP: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

ప్రతి ఏటా వేసవి కాలంలో చేపలు, ఇతర సముద్ర జీవులు సంతానోత్పత్తి చేస్తాయి. ఈ కీలక సమయంలో యాంత్రిక పడవలతో వేట సాగిస్తే మత్స్య సంపద అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సముద్ర పర్యావరణాన్ని కాపాడటానికి రాష్ట్ర మత్స్యశాఖ ఈ 61 రోజుల విరామాన్ని తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలు రాష్ట్రంలోని అన్ని రకాల మోటారు బోట్లకు వర్తిస్తాయి. కేవలం సంప్రదాయ పడవల ద్వారా తీరానికి సమీపంలో వేట సాగించే వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. వేట విరామ సమయంలో నిబంధనలు అతిక్రమించి సముద్రంలోకి వెళ్లే వారిపై మత్స్యశాఖ కఠినంగా వ్యవహరించనుంది.

మత్స్యకార భరోసా కింద ఆర్థిక సాయం

నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.5,000 జరిమానా విధించడమే కాకుండా, వారి వలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అంతేకాకుండా, సదరు బోటు యొక్క లైసెన్స్, రిజిస్ట్రేషనన్ను ఏడాది పాటు రద్దు చేస్తారు. తీరప్రాంతాల్లో నిఘా ఉంచేందుకు కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసుల సహకారం తీసుకోనున్నారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం భరోసా కలిపిస్తుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకం కింద అర్హత కలిగిన కుటుంబానికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత ఏడాది మత్స్యకార జీవన భృతి 20వేలు ఇచ్చారని, ఈ ఏడాది కూడా ఇదే నెలలో భృతి ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

శంషాబాద్‌లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి గుట్టురట్టు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha