Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిన్నారి గొంతులో ఇరుక్కున్నఆక్వేరియం చేప.. ఏం జరిగిందంటే?

చిన్నారి గొంతులో ఇరుక్కున్నఆక్వేరియం చేప.. ఏం జరిగిందంటే?

వార్త 2 months ago

Madhya Pradesh: ఇంట్లో ఆడుకుంటున్న ఒక ఏడాది చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది ఒక రంగుల చేప. ఆక్వేరియం శుభ్రం చేస్తుండగా అనుకోకుండా జరిగిన ఒక వింత ప్రమాదం వల్ల ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఈ సంచలన ఘటన వెలుగుచూసింది.

అసలేం జరిగింది?

ఇండోర్‌కు చెందిన ఒక కుటుంబంలో ఈ నెల 3వ తేదీన పెద్ద పిల్లలు ఇంట్లోని ఆక్వేరియంను శుభ్రం చేస్తున్నారు. అందులోని చేపలను ఒక వల సహాయంతో పట్టుకుని పక్కకు పెడుతున్నారు. అదే సమయంలో వారి ఏడాది తమ్ముడు అక్కడ ఆడుకుంటూ, చేపలను చూసి మురిసిపోతున్నాడు. సరిగ్గా చిన్నారి నోరు తెరిచి ఉన్న సమయంలో, వలలోని ఒక చేప ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి నేరుగా బాలుడి నోటిలోకి దూరి గొంతులో ఇరుక్కుపోయింది.

Read Also: Madhya Pradesh Crime: భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో భర్తను చంపించిన భార్య

Madhya Pradesh: గొంతులో బతికే ఉన్న మూడు అంగుళాల చేప

బాలుడికి ఊపిరాడకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే మహారాజా యశ్వంత్‌రావు ప్రభుత్వ ఆసుపత్రికి (MYH) తరలించారు. ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ యామినీ గుప్తా బాలుడిని పరీక్షించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. సుమారు మూడు అంగుళాల పొడవున్న ఆ చేప బాలుడి గొంతులో ఇంకా బతికే ఉండటంతో తీవ్రంగా కొట్టుకుంది. చేప ముళ్ళు గొంతులో గుచ్చుకోవడంతో లాలాజలంతో పాటు రక్తం కూడా బయటకు రావడం మొదలైంది.

సవాలుగా మారిన శస్త్రచికిత్స

చిన్నారి ప్రాణాలు కాపాడటం వైద్యులకు పెద్ద సవాలుగా మారింది. ఏ మాత్రం ఆలస్యం చేసినా ఊపిరితిత్తులకు గాలి అందక బాలుడు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో వైద్య బృందం యుద్ధ ప్రాతిపదికన అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి, గొంతులో ఇరుక్కున్న చేపను సురక్షితంగా బయటకు తీశారు.

ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆక్వేరియం వంటి వాటి విషయంలో తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

వరంగల్ స్విమ్మింగ్ పూల్ హత్య కేసు.. 9 మంది అరెస్ట్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha