Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిన్నారి ప్రాణం తీసిన మందారపువ్వు

చిన్నారి ప్రాణం తీసిన మందారపువ్వు

వార్త 2 months ago

Mysore Crime: కర్ణాటకలోని మైసూరు జిల్లా, హున్సూర్ ప్రాంతంలో, పువ్వు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంట్లో ఆడుకుంటూ ఉన్న ఆరున్నర నెలల పసికందు గొంతులో మందారపువ్వు ఇరుక్కుపోవడంతో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

హున్సూర్ తాలూకా హనగోడు హోబలి దొడ్డ హెజ్జూరు గ్రామానికి చెందిన సుదర్శన్, నవ్య దంపతుల రెండో కుమారుడు చిన్మయ్ గౌడ ఈ ప్రమాదానికి గురయ్యాడు.

Read Also:Maharastra Crime: దొంగతనాలకు అలవాటుపడ్డ కూతుళ్లు.. రాత్రంతా ఇనుప రాడ్డుకు వేలాడదీసిన కన్నతండ్రి..

 Infant Dies After Hibiscus Flower Stuck in Throat

Mysore Crime: ప్రమాదం ఎలా జరిగింది?

చిన్మయ్ గౌడ ఆహారపదార్థంగా భావించి మందారపువ్వు దిగువ ఉన్న కాండాన్ని తిన్నాడు.ఇది ప్రమాదవశాత్తు గొంతులో ఇరుక్కుపోయింది. దీనిని తీయడానికి చిన్నారి సోదరి ప్రయత్నించింది. పెద్దవారికి విషయం తెలియడంతో స్థానిక ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించినట్లు వైద్యులు చెప్పడంతో మైసూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా, చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. హున్సూర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

బుల్డోజర్‌తో దూసుకెళ్లి ఎనిమిది మందిని బలి తీసుకున్న దుండగుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha