Dailyhunt
చిన్నస్వామిలో అసలైన యుద్ధం.. ఆరెంజ్ క్యాప్ కోసం కోహ్లీ-గిల్ ఫైట్

చిన్నస్వామిలో అసలైన యుద్ధం.. ఆరెంజ్ క్యాప్ కోసం కోహ్లీ-గిల్ ఫైట్

వార్త 1 week ago

RCB vs GT: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు చిన్నస్వామి స్టేడియంలో జరగబోయే ఆర్‌సీబీ (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరు మాత్రమే కాదు, ఇద్దరు స్టార్ బ్యాటర్ల మధ్య 'ఆరెంజ్ క్యాప్' యుద్ధం కూడా.

Read Also:CSK vs MI highlights: అంపైర్ల తప్పిదమా? వ్యూహమా? సీఎస్‌కే మ్యాచులో 'కంకషన్' వివాదం!

RCB vs GT: ఆరెంజ్ క్యాప్ రేసులో హోరాహోరీ

లీగ్ సగం ముగిసేసరికి బ్యాటర్ల మధ్య పోటీ పీక్స్‌కు చేరింది. నేటి మ్యాచ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌ను నిర్ణయించడంలో కీలకం కానుంది.తన హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే నేడు భారీ ఇన్నింగ్స్ ఆడి ఆరెంజ్ క్యాప్‌ను తన వద్దే భద్రపరుచుకోవాలని చూస్తున్నాడు.గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీకి గట్టి పోటీ ఇస్తూ పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నాడు. నేటి మ్యాచులో గిల్ చెలరేగితే కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరతాడు.

మ్యాచ్ హైలైట్స్

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉన్న ఆర్‌సీబీ ఈ మ్యాచ్ గెలిచి తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తుంటే, జీటీ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ గెలుపు అనివార్యం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు (బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్).సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది..

 RCB vs GT IPL 2026

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) – బలమైన ప్లేయింగ్ XI

విరాట్ కోహ్లీ (స్టార్ బ్యాటర్), ఫిలిప్ సాల్ట్ (ఓపెనర్),దేవదత్ పడిక్కల్ (టాప్ ఆర్డర్),రజత్ పాటిదార్ (మిడిల్ ఆర్డర్),జితేష్ శర్మ (వికెట్ కీపర్),టిమ్ డేవిడ్ (ఫినిషర్),కృనాల్ పాండ్యా (ఆల్‌రౌండర్),రొమారియో షెపర్డ్ (ఆల్‌రౌండర్),భువనేశ్వర్ కుమార్ (పేసర్),జోష్ హాజిల్‌వుడ్ (ప్రధాన బౌలర్),రసిఖ్ సలామ్ దార్ (యంగ్ పేసర్)

    గుజరాత్ టైటాన్స్ (GT) – బలమైన ప్లేయింగ్ XI

    సాయి సుదర్శన్ (ఓపెనర్),శుభ్‌మన్ గిల్ (కెప్టెన్),జోస్ బట్లర్ (వికెట్ కీపర్),రాహుల్ తెవాటియా (ఫినిషర్),షారూఖ్ ఖాన్ (మిడిల్ ఆర్డర్),గ్లెన్ ఫిలిప్స్ (ఆల్‌రౌండర్),కాగిసో రబాడ (పేసర్),మహమ్మద్ సిరాజ్ (పేసర్),ప్రసిద్ధ్ కృష్ణ (పేసర్),రషీద్ ఖాన్ (స్టార్ స్పిన్నర్)వాషింగ్టన్ సుందర్ (స్పిన్ ఆల్‌రౌండర్)

      Read Also hindi news: hindi.vaartha.com

      Read Also Epaper : epaper.vaartha.com

      Read Also:

      అమ్మ లేని లోటు.. గుండె నిండా బాధ.. అయినా జట్టు కోసం మైదానంలోకి

      Dailyhunt
      Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha