Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిరాగ్ నాకు మంచి ఫ్రెండ్: కంగనా రనౌత్

చిరాగ్ నాకు మంచి ఫ్రెండ్: కంగనా రనౌత్

వార్త 2 months ago

Kangana on Chirag Paswan: నటి,ఎంపీ కంగనా రనౌత్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్‌, లపై వస్తున్న రూమర్లకు తాజాగా ఆమె ఇచ్చిన వివరణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ నెటిజన్లు చేస్తున్న చర్చలకు కంగన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

Read Also:Comedian Anudeep Bail: స్టాండప్ కమెడియన్ అనుదీప్‌కు బెయిల్ మంజూరు

Kangana on Chirag Paswan: ఆయన నా స్నేహితుడు మాత్రమే

ముఖ్యంగా పార్లమెంటు ప్రాంగణంలో వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగన ఈ రూమర్లపై సూటిగా స్పందించారు. అతను నాకు మంచి స్నేహితుడు. అంతకు మించి ఏమీ లేదని ఆమె స్పష్టం చేసింది.

 Kangana Ranaut Chirag Paswan

అయితే కంగనా, చిరాగ్ పాశ్వాన్‌ ఇద్దరూ 'మిలే నా మిలే హమ్' అనే సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు ఇద్దరూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దాంతో రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. చిరాగ్ కేవలం నా స్నేహితుడు మాత్రమే. మా మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. నిజం చెప్పాలంటే.. మా మధ్య ప్రేమ ఉండి ఉంటే, ఈ పాటికి మాకు పిల్లలు ఉండేవారు. మా పరిచయం ఇప్పటిది కాదు.. పదేళ్ల క్రితమే మేం కలిసి సినిమా చేశాం.. అంటూ కంగనా క్లారిటీ ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ముంబైలో మెరిసిన టాలీవుడ్ స్టార్.. చైతూకు 'ఉత్తమ నటుడు' పురస్కారం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha