Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్టాండప్ కమెడియన్ అనుదీప్‌కు బెయిల్ మంజూరు

స్టాండప్ కమెడియన్ అనుదీప్‌కు బెయిల్ మంజూరు

వార్త 2 months ago

Comedian Anudeep Bail: టాలీవుడ్ స్టార్ హీరోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో స్టాండప్ కమెడియన్ అనుదీప్‌కు ఊరట లభించింది. కామెడీ పేరుతో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నిహారిక కొణిదెలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో నమోదైన కేసులో అతనికి బెయిల్ మంజూరైంది.

Read Also: Meenakshi Seshadri Dance Video: 34 ఏళ్ల తర్వాత అదే గ్రేస్.. అదే మ్యాజిక్

 Stand-up comedian Anudeep granted bail

Comedian Anudeep Bail: పార్కులో ఉండగా అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని తన కుటుంబాన్ని కలవడానికి వెళ్లిన అనుదీప్‌ను కాకినాడ పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రితో కలిసి పార్కులో మాట్లాడుతుండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనుదీప్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల మనోభావాలను దెబ్బతీశాయని, సోషల్ మీడియాలో విద్వేషాన్ని పెంచేలా ఉన్నాయని బాధితులు ఫిర్యాదు చేశారు.

రూ. 10 వేల పూచీకత్తుతో బెయిల్

అరెస్ట్ అనంతరం నిందితుడిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం, రూ. 10,000 పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూ అనుదీప్‌కు బెయిల్ మంజూరు చేసింది. కామెడీ హద్దులు దాటకూడదని, వ్యక్తిగత దూషణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha