Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిట్టీల పేరుతో రూ.4 కోట్ల  మోసం.. దంపతుల అరెస్ట్!

చిట్టీల పేరుతో రూ.4 కోట్ల మోసం.. దంపతుల అరెస్ట్!

వార్త 2 weeks ago

Nellore Chit Fund Fraud: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో భారీ చిట్టీల మోసం వెలుగులోకి వచ్చింది. నమ్మిన జనాన్ని నట్టేట ముంచుతూ నిర్వాహకులు కోట్లాది రూపాయలతో బోర్డు తిప్పేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో చిట్టీల పేరుతో సుమారు రూ.4 కోట్ల మేర భారీ మోసం జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

Read Also : Nara Bhuvaneshwari Birthday: భార్య భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

 Couple arrested for Rs 4 crore fraud involving chit funds!

Nellore Chit Fund Fraud: 94 మంది బాధితులకు టోకరా

కృష్ణపట్నం ప్రాంతానికి చెందిన చల్లా గంగమ్మ, ఏడుకొండలు దంపతులు గత కొంతకాలంగా స్థానికంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. నమ్మకమైన మాటలతో నమ్మించి, సుమారు 94 మంది బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అయితే, చిట్టీల గడువు ముగిసినప్పటికీ బాధితులకు డబ్బులు చెల్లించకుండా, సమాధానం చెప్పకుండా ఈ దంపతులు తప్పించుకు తిరగడం ప్రారంభించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులంతా ఒక్కటయ్యారు. బాధితులంతా కలిసి ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న చిట్టీల నిర్వాహకులు చల్లా గంగమ్మ, ఏడుకొండలు దంపతులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పాస్ పుస్తకంలో పేరు మార్పునకు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఎమ్మార్వో

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha