Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిత్తూరు లో లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ జనం

చిత్తూరు లో లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ జనం

వార్త 2 months ago

Chittoor: చిత్తూరు జిల్లాలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వాహనదారుడిని కాపాడాల్సింది పోయి.. స్థానిక ప్రజలు తమ చేతికి చిక్కినంత మద్యం సీసాలను లూటీ చేశారు.

జిల్లాలోని బసిరెడ్డిపల్లి సమీపంలో భారీగా మద్యం లోడుతో వెళ్తున్న ఒక వ్యాన్ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని మద్యం సీసాలు రోడ్డుపై, పక్కనే ఉన్న పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి.

Also : Chinna Mallayya surrender: పోలీసులకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య

 Liquor van overturns in Chittoor.. People rush for liquor bottles

Chittoor: లుంగీలు, టవళ్లలో మద్యం లూటీ

వ్యాన్ బోల్తా పడిన విషయం చుట్టుపక్కల గ్రామస్తులకు తెలియడంతో క్షణాల వ్యవధిలోనే అక్కడికి భారీగా జనం చేరుకున్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, క్లీనర్ల పరిస్థితిని పట్టించుకోకుండా.. రోడ్డుపై పడి ఉన్న లిక్కర్ బాటిళ్లను ఏరుకోవడంలో నిమగ్నమయ్యారు. చేతికి దొరికినన్ని సీసాలను పట్టుకుని పరుగులు తీశారు. కొందరైతే ఏకంగా తమ లుంగీలు, టవళ్లనే సంచులుగా మార్చుకుని, అందులో మద్యం సీసాలను కుక్కుకుని మరీ ఇళ్లకు తరలించారు.

పురుషులతో పాటు మహిళలు కూడా..

ఈ మద్యం వేటలో పురుషులతో పాటు స్థానిక మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం గమనార్హం. రోడ్డు పక్కన పడి ఉన్న బ్రాండ్ల ఆధారంగా నచ్చిన సీసాలను ఏరుకుంటూ కనిపించారు. “లిక్కర్ వ్యాన్ బోల్తా పడింది.. బాటిళ్లు ఫ్రీగా దొరుకుతున్నాయి” అనే వార్త దావానలంలా వ్యాపించడంతో, వాహనదారులు సైతం తమ బైకులను రోడ్డు పక్కన ఆపేసి మరీ ఈ లూటీలో భాగస్వాములయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సొషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

దేవాన్ష్ పేరు ఏ ఘాట్‌కు పెట్టొద్దు.. మంత్రి లోకేష్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha