Samantha Seemantham in Chittoor: స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ ప్రస్తుతం సరికొత్త మైలురాళ్లతో దూసుకుపోతోంది. గతేడాది డిసెంబరులో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుని వివాహం చేసుకున్న సమంత, ఇటీవల విడుదలైన 'మా ఇంటి బంగారం' సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డ్ సృష్టించింది.
కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్న సమంత జీవితంలో ఇప్పుడు మరో మధురమైన ఘట్టం ఆవిష్కృతమైంది. సమంత సీమంతం వేడుక జరిగినట్లు కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read Also: Madhurapuri Sadana movie: ఫ్యామిలీ డ్రామా 'మధురాపురి సదన' మూవీ ఓటీటీ రివ్యూ!
Samantha’s baby shower celebrations in Chittoor… photos go viral!
Samantha Seemantham in Chittoor: చిత్తూరులోని అత్తగారింట్లో సంప్రదాయబద్ధంగా..
ఇటీవల భర్త రాజ్ నిడిమోరుతో కలిసి థాయ్‌లాండ్ ట్రిప్ వెళ్లిన సమంత, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత చిత్తూరులోని తన అత్తగారింటికి చేరుకుంది. ఈ క్రమంలోనే అత్తగారింట్లో కుటుంబ సభ్యులు సమంతకు ఎంతో సింపుల్‌గా, సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకను నిర్వహించారు. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో నిడిమోరు సోదరి శీతల్ పోస్ట్
ఈ సీమంతం వేడుకకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను రాజ్ నిడిమోరు సోదరి శీతల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు కాస్తా క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారాయి. ట్రెడిషనల్ లుక్‌లో సమంత ఎంతో అందంగా మెరిసిపోతుండటంతో ఆమె అభిమానులు, నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ ప్రియమైన నటి త్వరలోనే తల్లి కాబోతుండటంతో సమంత, రాజ్ జోడీకి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు మరియు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Epaper: epaper.vaartha.com

