Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చౌటాకూర్ మండలంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

చౌటాకూర్ మండలంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

వార్త 1 month ago

Choutakur: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు చౌటాకూర్ మండల కేంద్రంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.

రైతులకు సకాలంలో మద్దతు ధర అందించడంతో పాటు వారి పంటలకు సరైన మార్కెట్ కల్పించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Read Also: MLA Bandaru Shravani Sree: నారా లోకేష్‌కు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అభినందనలు

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభంతో మండలంలోని రైతులు తమ పంటను సులభంగా విక్రయించే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రజాప్రతినిధులు రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం రైతులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అలాగే రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు.

 Choutakur

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పార్కల రాం రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రామ గౌడ్, రైతులు లక్ష్మారెడ్డి, కృష్ణారెడ్డి, మాణిక్ రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, కొలుకూరి మొగులయ్య, దర్శనం సుధాకర్ గౌడ్, మెంబర్లు లక్ష్మయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

బాలయ్య తొడకొడితే వైసీపీ వాళ్లు ఒక్కరు కూడా మిగలరు - లోకేశ్ కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha