Ambedkar Jayanthi: భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి నేడు. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్ ప్రాంతంలో రాంజీ మకోజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు ఆయన జన్మించారు.
ఆయన అసలు పేరు భీమ్‌రావు రామ్‌జీ అంబేద్కర్.
Read Also:DR BR Ambedkar Jayanti : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ప్రత్యేకం
Ambedkar Jayanthi: Dr. B.R. Ambedkar’s 135th birth anniversary.. The life of that great man is an inspiration!
వివక్ష నుంచి విద్య వరకు
ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించిన భీమ్‌రావు, చిన్నప్పటి నుంచే కుల వివక్షను అత్యంత దారుణంగా ఎదుర్కొన్నారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో సమానంగా కూర్చునే అవకాశం లేకపోయినా, చదువు ద్వారానే తన జీవితాన్ని, సమాజాన్ని మార్చగలనని ఆయన బలంగా నమ్మారు. ఆ పట్టుదలే ఆయనను ఉన్నత విద్య వైపు నడిపించింది.
Ambedkar Jayanthi: మార్పు కోసం పోరాటం
కుటుంబ నేపథ్యం మరియు సామాజిక పరిస్థితులను అధిగమించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన తొలి తరం భారతీయుల్లో ఆయన ఒకరు. విదేశీ గడ్డపై పొందిన జ్ఞానం, అక్కడ ఎదురైన అనుభవాలు ఆయనను సామాజిక మార్పు కోసం పోరాడేలా పురికొల్పాయి. అంటరానితనం, కుల వివక్ష లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి నిరుపమానం. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర అజరామరం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
రాజ్యాంగ నిర్మాతకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘన నివాళులు

