అంబేద్కర్ జయంతి ప్రత్యేకం
DR BR Ambedkar Jayanti : ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు.
డా. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు మరియు సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమైనవి.
అసలు పేరు గురించి ఆసక్తికర విషయం
అంబేద్కర్ అసలు ఇంటి పేరు "అంబాదవేకర్". అయితే ఆయన గురువు మహాదేవ్ అంబేద్కర్ పేరు పాఠశాల రికార్డుల్లో చేర్చడంతో ఆయనకు "అంబేద్కర్" అనే పేరు స్థిరపడింది.
అత్యధిక చదువులు
అంబేద్కర్ విద్యాభ్యాసంలో కూడా అసాధారణ ప్రతిభ చూపించారు. ఆయనకు 64 సబ్జెక్టులపై పట్టు ఉండేది. అలాగే 9 భాషల్లో నైపుణ్యం సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 సంవత్సరాలు చదువుకున్నారు.
ఉన్నత విద్య
కొలంబియా యూనివర్సిటీ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన తొలి భారతీయుల్లో ఆయన ఒకరు.
భారత కార్మిక హక్కుల కోసం పోరాటం
భారతదేశంలో కార్మికుల పని గంటలను రోజుకు 14 గంటల నుంచి 8 గంటలకు తగ్గించడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు.
పుస్తకాలపై ప్రేమ
అంబేద్కర్ పుస్తకాలంటే ఎంతో ఇష్టపడేవారు. తన జీవితకాలంలో సుమారు 50,000 పుస్తకాలతో ఒక భారీ వ్యక్తిగత లైబ్రరీని ఏర్పాటుచేశారు.
మహిళా హక్కుల కోసం పోరాటం
మహిళలకు ఆస్తి హక్కు మరియు విడాకుల హక్కు కల్పించే హిందూ కోడ్ బిల్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే ఆ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఆయన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Read Also:CM Revanth Reddy: మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పూర్తి మద్దతు
DR BR Ambedkar Jayantiవివక్షపై పోరాటం
బాల్యంలో కుల వివక్షను ఎదుర్కొన్న అంబేద్కర్ జీవితాంతం అంటరానితనం నిర్మూలన కోసం పోరాడారు. దళిత వర్గాల హక్కుల కోసం ఆయన నిరంతరం కృషి చేశారు.
బౌద్ధమతంలోకి మార్పు
1956లో అంబేద్కర్ దాదాపు 5 లక్షల మంది అనుచరులతో కలిసి బౌద్ధమతంలోకి మారారు.
రాజ్యాంగ నిర్మాత
స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆలోచనలు భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అయ్యాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

