Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు కమాండర్ రూపీ మృతి!

ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు కమాండర్ రూపీ మృతి!

వార్త 2 months ago

Maoist Commander Rupy: మిరుదొడ్డి మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన రంగబోయిన నరసయ్య లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం కాగా ముగ్గురు భాగ్య కవిత మమత కూతుర్లు కాగా ఒక కుమారుడు చిన్నవాడైన కుమార్ లు ఉన్నారు అందులో పెద్ద కూతురైన భాగ్య అలియాస్ రూపి నక్సల్స్ ఉద్యమాలకు ఆకర్షితులై సుమారు 25 ఏళ్ల క్రితమే 2004లో మావోయిస్టు పార్టీలో చేరింది అప్పటినుండి ఇప్పటివరకు కుటుంబ సభ్యులతో దూరంగా ఉంది మావోయిస్టు దళ సభ్యురాలిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు దళ కమాండర్ గా పనిచేస్తూ చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా లో సోమవారం రోజు జరిగిన, ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అయిన రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందింది.

Read Also:CM Revanth Reddy: మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పూర్తి మద్దతు

Maoist Commander Rupa: తీరని ఎదురుచూపులు

ఈమెపై గతంలోప్రభుత్వం 25 లక్షల రివార్డు సైతం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు మావోయిస్టు రైతు దేశంగా మారుస్తామని ఇప్పటికే ప్రకటించగా కొంతమంది నక్సలైట్లు మావోయిస్టు అగ్ర అనిత గణపతితో సహా కొంతమందిమిగిలిఉండగా ఇందులో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ గా రూపీ అలియాస్ రంగ బోయిన లక్ష్మీ ఉన్నారు. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి నరసయ్య మరణించినప్పుడు కూడా భాగ్య కడసారి చూపుకు రాలేకపోయారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘మార్చి 31 వరకు మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం’ అని ప్రకటించడంతో, తమ సోదరి జనజీవన స్రవంతిలోకి వస్తుందని తల్లి లక్ష్మి, చెల్లెళ్లు, సోదరుడు ఎంతో ఆశగా ఎదురుచూశారు.

 Maoist Commander Rupy Encounter

కానీ ఇంతలోనే సోమవారం చతిస్గడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ నక్సలైట్ రూపీ మరణించడంతో కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.నక్సలైట్ రూపీ మృతి చెందిన సమాచారం తెలుసుకొని శవాన్ని తీసుకురావడానికి రూపీసోదరి తోపాటు కొంతమంది గ్రామస్తులు కలిసి ధర్మారం గ్రామం నుండి సోమవారం చతిస్గడ్ బయలుదేరి వెళ్లారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన: హరీష్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha