Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు

వార్త 1 week ago

BRAOU Admissions: తెలంగాణలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది.

వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ విశ్వవిద్యాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

బీఏ (BA), బీకాం (B.Com), బీఎస్సీ (B.Sc) ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Read Also : Indiramma Flats : 'లక్కీ'గా ఎంపికైనంత మాత్రాన ఇందిరమ్మ ఇల్లు రాదా?

 Deadline Extended for Dr. B.R. Ambedkar University Degree Admissions

BRAOU Admissions: అధికారిక వెబ్‌సైట్, కాంటాక్ట్ నంబర్

మొదటి సంవత్సరంతో పాటు ద్వితీయ (2nd Year), తృతీయ (3rd Year) సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా తమ కోర్సు ఫీజును సెప్టెంబర్ 30వ తేదీ లోగా చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించి తమ ప్రవేశాలను నవీకరించుకోవాలని (Renewal) కోరారు.

ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు, కోర్సుల సమాచారం, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్www.braouonline.inను సందర్శించవచ్చు. ఏవైనా సందేహాలు లేదా సందేహాల నివృత్తి కోసం 7382929721 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చని విశ్వవిద్యాలయ యంత్రాంగం తెలిపింది.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల సర్వేలో రైతులు తీవ్ర అభ్యంతరాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha