Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

వార్త 1 week ago

Spirit Movie: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కోసం హైదరాబాద్‌లో 60 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ప్లాన్ చేశారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ పోలీస్ స్టేషన్ సెట్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Read also: Telugu Folk Songs: కుర్రాళ్ళు తెగ పాడుకుంటున్న పాట ఇదేనట!

 Prabhas Spirit Movie Police Set Shoot

Spirit Movie: పవర్ ఫుల్ కాప్ రోల్‌లో డార్లింగ్

ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని విధంగా చాలా ఇంటెన్స్ ఉన్న ఐపిఎస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రస్తుత షెడ్యూల్‌లో కథకు అత్యంత కీలకమైన ఇన్వెస్టిగేషన్ సీన్స్‌ను డైరెక్టర్ షూట్ చేస్తున్నారు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ అలాగే డైలాగ్ డెలివరీ ఈ మూవీలో హైలైట్‌గా నిలవనున్నాయి.

బాక్సాఫీస్ షేక్ చేసే యాక్షన్ సీక్వెన్స్

కేవలం మాటలే కాకుండా ఈ 60 రోజుల్లో నాలుగు భారీ యాక్షన్ సీన్లను కూడా పూర్తి చేయనున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ తో పాటు క్లైమాక్స్ కు సంబంధించిన కొన్ని ఫైట్లను ఈ సెట్ లోనే తీయబోతున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha