Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డబ్బులు రాలేదని ఏకంగా ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారు!

డబ్బులు రాలేదని ఏకంగా ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారు!

వార్త 2 months ago

Sircilla ATM Theft: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దోపిడీ దొంగలు బరితెగించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అర్ధరాత్రి వేళ ఎస్‌బీఐ (SBI) ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న దొంగలు, ఏకంగా మిషన్‌ను పెకలించి ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

Read Also:Meerut in Uttar Pradesh: కన్నకూతురు శవంతో ఐదు నెలల సహవాసం: మేరఠ్‌లో వెలుగుచూసిన హృదయవిదారక ఘటన!

ఘటన వివరాలు

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్‌లోకి చొరబడిన దొంగలు, మొదట నగదును దొంగిలించేందుకు ప్రయత్నించారు.డబ్బులు తీయడం సాధ్యం కాకపోవడంతో, ఏకంగా ఏటీఎం మిషన్‌నే పెకలించి వాహనంలో వేసుకుని పరారయ్యారు.ఏటీఎం మిషన్‌లో చోరీ జరిగిన సమయానికి ఎంత నగదు ఉందనేది బ్యాంకు అధికారుల నుండి స్పష్టత రావాల్సి ఉంది.

Sircilla ATM Theft: దర్యాప్తు ముమ్మరం

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భద్రతా లోపాలపై ఆరా తీశారు.నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాలతో పోలీస్ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వివరాలను సేకరిస్తున్నారు.

ATM చోరీ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఏటీఎం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు వాడిన వాహనం, వారి కదలికలపై కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha