Dailyhunt
డబుల్ డెక్కర్ కారిడార్‌గా ఎల్బీనగర్-హయత్‌నగర్ లైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

డబుల్ డెక్కర్ కారిడార్‌గా ఎల్బీనగర్-హయత్‌నగర్ లైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

వార్త 1 week ago

Double Decker Metro: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం 5.5 కి.మీ మేర ఒకే పిల్లర్‌పై డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను ప్రతిపాదించింది.

ఈ నమూనా ప్రకారం, మొదటి అంతస్తులో మూడు వరుసల జాతీయ రహదారి (ఫ్లైఓవర్), దానిపై రెండో అంతస్తులో మెట్రో రైలు మార్గం ఉంటుంది. నాగ్‌పూర్ తరహాలో ఈ నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా భూసేకరణ సమస్యలు తగ్గడమే కాకుండా, పదేపదే రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల వనస్థలిపురం, హయత్‌నగర్ పరిసరాల్లోని సుమారు 70 కాలనీల ప్రజలకు ప్రయాణం సులభతరం కానుంది.

Read Also :Hyderabad ATM Theft: హైదరాబాద్ లో భారీ గోల్మాల్

Double Decker Metro: కేంద్రం ఆమోదం.. రూ.941 కోట్లతో నిర్మాణం

 Double-decker construction at a cost of Rs 941 crore brings relief to 1.2 million people.

ఈ భారీ ప్రాజెక్టు కోసం పాత మెట్రో డీపీఆర్‌లో (DPR) ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దీనికి సుమారు రూ.941 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా, అందులో కేంద్రం వాటా రూ.741 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు భరించనున్నాయి. రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ప్రతిపాదనలపై కేంద్రంతో చర్చలు జరిపి ఇప్పటికే ప్రాథమిక ఆమోదం పొందారు. రానున్న ఆరు నెలల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

శ్రీశైలం భక్తులకు తీపికబురు: ఎలివేటెడ్ కారిడార్‌కు అడుగులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha